Sangeeth Sobhan Name Confusion In Rakasa Pre Release Event : యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాకాస. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్స్ హీరో సంగీత్ శోభన్ ఆయన సోదరుడు సంతోష్ శోభన్ పేరుతో కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.

సంతోష్ ఎక్కడమ్మా?

 ఈవెంట్‌‌లో సింగర్ రఘురామ్ (మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధృవన్) సంతోష్ శోభన్‌కు నేను హ్యూజ్ ఫ్యాన్ అంటూ కామెంట్ చేశారు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన హీరో సంగీత్ శోభన్... 'సంతోష్ శోభనా ఎక్కడమ్మా ఈ రోజు తేలిపోవాలి. నువ్వు బయటకు రా రా. మనం మాట్లాడుకోవాలి.' అంటూ నవ్వులు పూయించారు.

దీంతో సారీ చెప్పిన సింగర్ రఘురామ్... కొన్నిసార్లు స్టేజ్ ఫియర్ వల్ల అలా జరుగుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. 'పేపర్ బాయ్ సినిమాలో సంతోష్ శోభన్ గారికి మూడు పాటలు పాడాను. నా కెరీర్ అక్కడ అలా స్టార్ట్ అయ్యింది. అలా యాక్సిడెంటల్‌గా సంతోష్ శోభన్ అని వచ్చేసింది' అంటూ చెప్పారు.

Also Read : రామాయణ టీజర్ - హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్... బిగ్ సర్ప్రైజ్ ఎప్పుడంటే?

అలాగే, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ కేవీ సైతం సంతోష్, సంగీత్ అంటూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ క్రమంలో హీరో సంగీత్ అక్కడి నుంచి సరదాగా వెళ్లిపోయే మూమెంట్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా వేదికంగా నవ్వులు పూశాయి. 'సారీ సంగీత్. ఇప్పటివరకూ సింగర్ రఘుకు చెప్పా. అలా ఎందుకు అన్నావు అని. అదే డిస్కషన్‌తో స్టేజీపైకి వచ్చా. అందుకే సంతోష్ అనే పేరు వచ్చేసింది.' అంటూ సారీ చెప్పారు.  ప్రస్తుతం ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

'అలా ఛాన్స్'

'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వల్లే తనకు మ్యాడ్, రాకాస మూవీస్ ఛాన్స్ వచ్చినట్లు చెప్పారు హీరో సంగీత్ శోభన్. 'ప్రొడ్యూసర్ నిహారిక ఈ సినిమా కోసం ఎంతో ప్యాషన్‌తో పని చేశారు. ఫస్ట్ ప్రాజెక్టు మీదే రూ.9 కోట్లు పెట్టడం చిన్న విషయం కాదు. మూవీ టీం అంతా ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాం. గెటప్ శ్రీని గారితో సీన్స్ అంటే కొంచెం భయపడ్డాను. ఆయన జబర్దస్త్‌లో లెజెండ్. రాబోయే పాత్రలను ముందే అందులో చేసేశారు. ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి సినిమా చేశారు.

శర్వానంద్ అన్న బైకర్ కూడా అదే రోజున వస్తుంది. ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నా మ్యాడ్ మూవీ చూసి ఫస్ట్ కంగ్రాట్యులేట్ చేసింది ఆయనే. మార్నింగ్ షో బైకర్ చూస్తే... ఈవినింగ్ షో మా సినిమాకు రండి.' అని అన్నారు.

'రాకాస' మూవీలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. అలాగే, వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ, వాసు ఇంటూరి, జబర్దస్త్ రోహిణి, నైంటీస్ ఫేం రోహన్ తదితరులు నటించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మించగా... అనుదీప్ కేవీ మ్యూజిక్ అందించారు.