Raakaasa OTT Trending : కోటలో బ్రహ్మ రాక్షసుడు... బలిగా మనిషి ప్రాణం - ఓటీటీలో టాప్ ట్రెండింగ్ హారర్ మూవీ
Netflix Trending Movie : రీసెంట్‌గా వచ్చిన హారర్ కామెడీ మూవీ రాకాస ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. 1.2 మిలియన్ వ్యూస్‌తో నెట్ ఫ్లిక్స్‌లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

Raakaasa Top OTT Trending With Millions Views In Netflix : అనగనగా ఒక ఊరు... ఊరిలో కోట... కోటలో దాగి ఉన్న రహస్యం. మూడు సంకేతాలు వస్తే కోటలోకి మనిషిని ఆహారంగా పంపాలి. తన లవ్ కోసం విదేశాల నుంచి వచ్చిన యువకుడు అనుకోని పరిస్థితుల్లో కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. చివరకు ఏం జరిగింది? కోటలో రహస్యాన్ని ఛేదించి తనను తాను కాపాడుకున్నాడా?... ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మరి ఆ మూవీ ఏంటో తెలుసా...
థియేటర్స్, ఓటీటీ సూపర్ రెస్పాన్స్
యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన రీసెంట్ హారర్ ఫాంటసీ మూవీ 'రాకాస'. థియేటరల్లో అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకెళ్లిన మూవీ ఓటీటీలోనూ అంతే ట్రెండింగ్‌లో ఉంది. ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా... గ్లోబల్ చార్ట్‌లో టాప్ 7కి చేరుకుంది.
ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతూ ఉందని సదరు సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.
Also Read : సూర్య ఫేస్‌లో హిట్టు కళ కనబడుతోంది... త్రిష కొత్త సినిమా 'కరుప్పు' ట్రైలర్
ఇంటర్నేషనల్ మార్కెట్ సరసన...
ఈ ఘనతతో ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన నాన్ ఇంగ్లీష్ మూవీస్ జాబితాలో 'రాకాస' పలు ఇంటర్నేషనల్ మార్కెట్ల చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి. మౌత్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్లియర్ రెస్పాన్స్ పొందుతోంది. పిల్లల నుంచీ పెద్దల వరకూ అందరినీ ఈ మూవీ ఆకట్టుకుంటోంది.
Also Read : ఓటీటీలోకి సడన్‌గా 3,500 కోట్ల కలెక్షన్స్ మూవీ - స్టోరీలో ఏముంది?... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించగా... సంగీత్, నయన్‌లతో పాటు వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ, రమణ భార్గవ్, వాసు యింటూరి, జబర్దస్త్ రోహిణి, నైంటీస్ ఫేం రోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమ్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించారు.
Also Read : అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా లెజినోవా - రేర్ ఫ్యామిలీ ఫోటో
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు























