Ram Gopal Varma : ప్రస్తుతం ఎక్కడ చూసినా మూవీ లవర్స్ అంతా ‘యానిమల్’ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలోనే కాదు.. మరెన్నో అంశాల్లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. అసలు అంత పెద్ద సినిమా ఎవరైనా చూస్తారా అని విమర్శించిన క్రిటిక్స్.. ‘యానిమల్’కు వస్తున్న రెస్పాన్స్ చూసి షాక్‌తో పాటు సైలెంట్ కూడా అయ్యారు. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం ‘యానిమల్’ చూసి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తన స్టైల్‌లో రివ్యూను అందించాడు. ఇక ఈ రివ్యూకు సందీప్ రెడ్డి వంగా స్పందించాడు.


ఆర్జీవీ ట్వీట్‌కు సందీప్ రెస్పాన్స్..
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’.. రామ్ గోపాల్ వర్మను ఎంతగా ఆకట్టుకుందో తెలుసుకోవాంటే.. ఆయన డీటెయిల్‌గా ఇచ్చిన రివ్యూ చూస్తే చాలు. ఈ రివ్యూలోనే సినిమాకు సంబంధించిన చాలావరకు అంశాలను కవర్ చేశాడు వర్మ. తనకు నచ్చిన సీన్స్ గురించి స్పెషల్ గురించి స్పెషల్‌గా చెప్పుకొచ్చాడు. నచ్చిన సీన్స్ గురించి మాత్రమే కాదు.. నచ్చని సీన్స్ గురించి కూడా ప్రస్తావించాడు. ఇప్పటివరకు ప్రపంచంలోని ఏ దర్శకుడు ఇంత నమ్మకంగా ఇంత పెద్ద సినిమాను విడుదల చేయలేదని, నీ పాదాల ఫోటోలు పంపు నమస్కరిస్తాను, నీకు ముద్దుపెట్టాలని ఉంది అంటూ సందీప్ డైరెక్షన్‌ను తన స్టైల్‌లో పొగిడాడు ఆర్‌జీవీ.


కొన్ని విషయాలను పక్కనపెడితే..
ఇక రామ్ గోపాల్ వర్మలాంటి సెన్సేషనల్ డైరెక్టర్.. తన సినిమాకు ఇంత పాజిటివ్‌గా, డీటెయిల్ రివ్యూ ఇవ్వడంతో సందీప్ వంగా సంతోషంలో తేలిపోయి.. తన రెస్పాన్స్‌ను ట్వీట్ చేశాడు. ‘రామ్ గోపాల్ వర్మలాగా ఇంకా ఏ దర్శకుడు ఇండియన్ సినిమాకోసం కష్టపడలేదని నేను నమ్ముతాను. నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ దగ్గర నుంచి యానిమల్ సినిమాకు రివ్యూ లభించింది. ఆయన స్టైల్‌లో రాసిన కొన్ని విషయాలను పక్కనపెడితే.. రామ్ గోపాల్ వర్మకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు సందీప్. అయితే సందీప్.. ప్రత్యేకంగా ‘కొన్ని విషయాలను పక్కనపెడితే అనడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ కొన్ని విషయాలు ఏంటి అనుకుంటూ కామెంట్స్ సెక్షన్‌లో చాలామంది యూజర్లు కామెడీగా చర్చించుకుంటున్నారు.






తండ్రీకొడుకుల బంధం..
సందీప్ వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’.. తండ్రీకొడుకుల మధ్య ఉండే బంధంపై ఆధారపడిన కథతో తెరకెక్కింది. ఇందులో తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించగా.. కొడుకు పాత్రను రణబీర్ కపూర్ పోషించాడు. అయితే ఈ సినిమా కథ ఏంటి అనేది దాదాపు ‘యానిమల్’ ట్రైలర్‌లోనే చెప్పేశాడు సందీప్. తన తండ్రిపై హత్యా ప్రయత్నం జరిగిందని శత్రువులను చంపడానికి బయల్దేరుతాడు రణబీర్. అందుకే సినిమాలో యాక్షన్ లవర్స్‌కు నచ్చేలా చాలా వైలెన్స్ ఉంది. ఒక యాక్షన్ సినిమాను 3 గంటల 21 నిమిషాల నిడివితో విడుదల చేసినా.. అందులో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు, హిట్ చేస్తారు అని ‘యానిమల్’తో నిరూపించాడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.200 కోట్ల రికార్డును సాధించింది.


Also Read: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!