Samantha About Relation With Rahul Ravindran: ఒక్క అంశం ఆధారంగా కెరీర్‌ను నిర్ణయించలేమని సమంత అన్నారు. కోలీవుడ్‌లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అతనితో రిలేషన్‌కు పేరు పెట్టలేను
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‍తో అనుబంధాన్ని సమంత (Samantha) పంచుకున్నారు. తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు రాహుల్ తన వెంట ఉన్నారని.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడని తెలిపారు. 'రాహుల్ రవీంద్రన్.. నా స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్త సంబంధీకుడా అని చెప్పలేను.' అని చెప్పారు. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం తన అదృష్టమని.. దాంతో పాటే తాను పడిన కష్టమే దీనికి కారణమని అన్నారు.
'ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా డిసైడ్ చేస్తే అది అబద్ధమే అవుతుంది. ఎన్నో నిర్ణయాలు తెలిసీ తెలియక కెరీర్‌పై ప్రభావం చూపుతాయి.' అని సమంత తెలిపారు.
సమంతపై డైరెక్టర్ ప్రశంసలు
ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara) సమంతపై ప్రశంసలు కురిపించారు. 'సమంతకు నేను బిగ్ ఫ్యాన్‌ను. ఐదేళ్లుగా ఆమెను దగ్గర నుంచి చూస్తున్నా. సమంత బాధ పడినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చేవి. ఆమెను చూసి ఎంతోమంది అమ్మాయిలు ధైర్యం తెచ్చుకోవాలి. ఆమెతో సినిమా తీయాలని రెండుసార్లు ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. ఎప్పటికైనా సమంతతో కచ్చితంగా సినిమా తీస్తాను. ఆమె నటించిన 'ఊ అంటావా..' పాట అంటే నాకు చాలా ఇష్టం.' అని సుధా తెలిపారు.
ఈ మాటలకు స్పందించిన సమంత.. తనకు యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉందని చెప్పారు. అయితే, కచ్చితంగా యాక్షన్ మూవీనే చేద్దామని అన్నారు.
మరోసారి రూమర్స్
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేదు. ఆ తర్వాత ఏడాది తాను మయోసైటిస్‌తో బాధ పడుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఓ వైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలు, సిరీస్‌ల్లోనూ నటించారు. మరోవైపు.. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాల్లో వార్తలు హల్చల్ చేశాయి. బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో ఆమె ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఇటీవలే ఓ పోస్టుకు లైక్ కొట్టి మరోసారి వార్తల్లో నిలిచారు. సక్సెస్ వెర్స్ అనే ఇన్ స్టా ఖాతాలో రిలేషన్ షిప్ బ్రేకప్‌పై వచ్చిన ఓ పోస్ట్‌కు ఆమె లైక్ కొట్టడంపై చర్చ సాగింది. 'కుటుంబంలో వైఫ్ తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆ భర్త ఆమెను వదిలేయడానికే ఇష్టపడుతున్నాడు. ఒకవేళ భర్తకు హెల్త్ బాగా లేకుంటే భార్య మాత్రం అతన్ని విడిచిపెట్టడం లేదు. వైఫ్‌తో ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేకపోవడం వల్లే భర్త ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని సర్వేలో తేలింది.' అని పోస్ట్ పెట్టగా దానికి సమంత లైక్ కొట్టారు.
నిర్మాతగానూ..
సమంత ఇటీవలే 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి.. 'శుభం' మూవీని నిర్మించారు. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3'లో సమంత కనిపించనున్నారు. 'మా ఇంటి బంగారం' అనే సినిమాలోనూ నటిస్తున్నట్లు సమంత ఇటీవల ప్రకటించారు.