Samantha Wedding With Raj Nidimoru In Isha Foundation : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్ లింగ భైరవి దేవీ ఆలయంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. దక్షిణాది సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగ్గా... కంచి పట్టుచీరతో పెళ్లి కూతురుగా సమంత అందంగా ముస్తాబయ్యారు.
అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజ్ సమంత మెడలో మూడు ముళ్లు వేశారు. ఇన్ స్టా వేదికగా పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. కొత్త జంటకు నెటిజన్లు విషెష్ చెబుతున్నారు.
గత కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి ట్రిప్పులు, రెస్టారెంట్లకు వెళ్లి కెమెరాల కంట పడడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇప్పటివరకూ రిలేషన్ షిప్ రూమర్లపై ఇద్దరూ బహిరంగంగా రియాక్ట్ కాలేదు. కానీ రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో సమంత రాజ్‌ను హగ్ చేసుకుని క్లోజ్‌గా మూవ్ అయిన ఫోటో షేర్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య డేటింగ్ అంటూ మరోసారి ట్రెండ్ అయ్యింది.
అలా మొదలైంది
రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన 'సిటాడెల్: హనీ బన్నీ', 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2'లో నటించారు. ఈ టైంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. 'శుభం' సినిమాతో సమంత నిర్మాతగా మారగా... రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సక్సెస్ మీట్‌లోనూ ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
Also Read : గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్‌లో భూమిక స్పెషల్ రోల్... రిలీజ్ ఎప్పుడంటే?
సమంత హింట్ ఇచ్చారా?
రాజ్‌తో రిలేషన్, డేటింగ్ వార్తల నేపథ్యంలో సమంత రీసెంట్‌గా చేసిన పోస్ట్ మరింత చర్చనీయాంశమైంది. 'ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో గత ఏడాదిన్నరగా నా కెరీర్ పరంగా ఎన్నో సాహసోపేతమైన అడుగులు వేశా. రిస్క్ తీసుకుంటూ ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నా. చిన్న చిన్న సక్సెస్‌లను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా. ప్రతిభావంతులైన, కష్టపడి పని చేసే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ఆరంభమే.' అంటూ రాసుకొచ్చారు. రాజ్‌తో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు.
రాజ్ మాజీ భార్య పోస్ట్
సోమవారం ఉదయం నుంచి సమంత, రాజ్‌ల పెళ్లి అంటూ సోషల్ మీడియా కోడై కూస్తుండగా... రాజ్ మాజీ భార్య శ్యామాలీ దే చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. 'తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు' అంటూ ఇన్ స్టా పోస్ట్ చేయడంతో వీరి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. 2022లో రాజ్, శ్యామాలి డివోర్స్ తీసుకున్నారు. మరోవైపు, సమంత, రాజ్ పెళ్లి ఉదయం జరిగినట్లు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.