Maa Inti Bangaram: మా ఇంటి బంగారం... పూజతో సమంత కొత్త సినిమా షురూ - హిట్ కాంబోలో గురూ!
Samantha Latest Telugu Movie: ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి తొలి ప్రయత్నంగా 'శుభం' ప్రొడ్యూస్ చేశారు సమంత. ఇప్పుడు తాను ప్రధాన పాత్రలో 'మా ఇంటి బంగారం' స్టార్ట్ చేశారు.

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన ఆవిడ... ఆ సంస్థలో తొలి ప్రయత్నంగా 'శుభం' ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు తాను ప్రధాన పాత్రలో సొంత నిర్మాణ సంస్థలో కొత్త సినిమా స్టార్ట్ చేశారు.
సమంత... 'మా ఇంటి బంగారం'
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ నెం 2గా రూపొందుతున్న సినిమా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram Movie). ఇవాళ ఈ సినిమాను పూజతో ప్రారంభించినట్టు అనౌన్స్ చేశారు. ఇందులో సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో... సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలిపారు.
'ఓ బేబీ' దర్శకురాలితో సినిమా
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' గుర్తుందిగా! ఆ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పుడీ 'మా ఇంటి బంగారం' చిత్రానికీ ఆవిడే డైరెక్టర్. హిట్ కాంబో... 'ఓ బేబీ' బ్లాక్ బస్టర్ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
View this post on Instagram
సన్నిహితులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ కలయిక, ఆశీర్వాదాల నడుమ 'మా ఇంటి బంగారం' సినిమా ప్రారంభమైందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన మూవీ ఫస్ట్ లుక్ గమనిస్తే... ఇదొక గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామా అని అర్థం అవుతోంది. అద్భుతమైన యాక్షన్, మంచి కథ - కథనాలతో కూడిన సినిమా 'మా ఇంటి బంగారం' అని చిత్ర బృందం చెబుతోంది. ఆల్రెడీ సినిమా షూటింగ్ ప్రారంభమైందని, మరిన్ని వివరాలు త్వరలో తెలిజేస్తామని పేర్కొన్నారు.
Also Read: 'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!
'మా ఇంటి బంగారం' చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్, సంగీతం: సంతోష్ నారాయణన్, కథ - స్క్రీన్ ప్లే: సీతా మీనన్ - వసంత్ మరిన్‌గంటి, కాస్ట్యూమ్స్: పల్లవి సింగ్, ప్రొడక్షన్ డిజైనర్: ఉల్లాస్ హైదర్, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, నిర్మాతలు: సమంత - రాజ్ నిడమోరు - హిమాంక్ దువ్వూరు, దర్శకత్వం: నందినీ రెడ్డి.





















