Samantha Ruth Prabhu: విడాకుల తర్వాత నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను సమంత లాకెట్టుగా మార్చుకుందా?
Samantha Ruth Prabhu : 2021లో నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సమంత సినిమాలతో బిజీగా ఉంది. ఆమె మరొకరితో డేటింగ్ చేస్తోందనే పుకార్లు విన్పిస్తున్నాయి. మరి ఆమె తన నిశ్చితార్థ ఉంగరాన్ని ఏం చేసిందో తెలుసా?

మాజీ సెలబ్రిటీ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత డివోర్స్ తీసుకొని ఏళ్లు గడుస్తోంది. అయినప్పటికీ వీరిద్దరి గురించి వచ్చే వార్తలు ఆగట్లేదు. కొన్నాళ్ళ క్రితం సమంత తన వెడ్డింగ్ డ్రెస్ ని రీ డిజైన్ చేయించుకుందనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన ఎంగేజ్మెంట్ రింగ్ ను లాకెట్ గా మార్చుకుంది అనే విషయం తెరపైకి వచ్చింది.
ఎంగేజ్మెంట్ రింగ్ ను లాకెట్ గా మార్చుకుందా?
అక్కినేని నాగచైతన్య - సమంత 2021లో డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. విడిపోయిన తర్వాత నాగ చైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే హీరోయిన్ సమంత మాత్రం తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇలాంటి టైంలో తాజాగా సూరత్ కు చెందిన నగల డిజైనర్ ధృమిత్ మెరులియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో ఆయన సమంత తన ఎంగేజ్మెంట్ రింగ్ ను అందమైన లాకెట్ గా మార్చుతుందని పేర్కొన్నారు. అయితే ఆ వార్తలు నిజమేనని సమాచారం.
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన ప్రిన్సెస్ కట్ డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ ను లాకెట్ గా మార్చుకుంది. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు చేశారని సదరు నగలు వ్యాపారి వీడియోని పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆమె ఏఏ సందర్భాలలో ఆ లాకెట్ ని ధరించిందో కూడా వెల్లడించారు. "విడాకుల తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్ ను తిరిగి ఏదో ఒకరకంగా ఉపయోగించడం అన్నది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. సమంతతో పాటు చాలా మంది సెలబ్రిటీలు ఇలాగే చేశారు" అని చెప్పుకొచ్చాడు ఆ నగల డిజైనర్ పేర్కొన్నారు. ఇక 2024లో అవార్డుల వేడుకలో సమంత తన వెడ్డింగ్ గౌనును రీ డిజైన్ చేయించి, ధరించిన సంగతి తెలిసిందే. డిజైనర్ క్రేషా బజాజ్ సమంత వెడ్డింగ్ గౌన్ ను రీ డిజైన్ చేశారు. అప్పట్లో సమంత నాగచైతన్య పై పగ తీర్చుకోవడానికి ఇలా చేసిందని కామెంట్స్ వినిపించాయి. కానీ సమంత మాత్రం దాన్ని పాజిటివ్ గా తీసుకోవడానికే ఇలా రీడిజైన్ చేయించినట్టు వెల్లడించింది.
Also Read: 'గుండమ్మ కథ'లో కార్తీక దీపం మోనిత... ఫుల్ ఫ్యాషన్ గురూ - అదిదా ట్విస్ట్!
బాలీవుడ్ డైరెక్టర్ తో డేటింగ్ రూమర్లు...
గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ లో ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల కాలంలో పిక్ బాల్ లీగ్ మ్యాచ్ చూడడానికి రాజ్ - సమంత జంటగా రావడం అందరి దృష్టిలో పడింది. ఇక ఈ డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలోనే తాజాగా సమంత మరోసారి రాజ్ తో ఈవెంట్లో మెరిసింది. ఆ ఈవెంట్ మరెవరిదో కాదు ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ ది. సమంత వెడ్డింగ్ గౌను డిజైన్ చేసింది ఆవిడే. క్రేషా పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్న ఈవెంట్ లో సమంత - రాజ్ నెడిమూరు జంటగా కనిపించారు. దీంతో మరోసారి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత రక్త బ్రహ్మాండ్, బంగారం వంటి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.