Maa Inti Bangaaram Release Date : సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్ - సమ్మర్ తర్వాత యాక్షన్ ట్రీట్
Maa Inti Bangaaram : స్టార్ హీరోయిన్ సమంత 'మా ఇంటి బంగారం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సమ్మర్ తర్వాత వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha's Maa Inti Bangaaram Movie Release Date Locked : స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత యాక్షన్ థ్రిల్లర్ 'మా ఇంటి బంగారం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేయగా... రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమ్మర్ తర్వాత థియేటర్లలోకి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సినిమాకు సమంత స్నేహితురాలు, ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత భర్త, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్, సీనియర్ నటి గౌతమి, మంజుషా, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
View this post on Instagram
Also Read : హిస్టారికల్ ప్లేస్‌లో 'జై హనుమాన్' - అంజనాద్రి బెట్టపై పూజా కార్యక్రమంతో... స్పెషల్ ఏంటో తెలుసా?
సమంత సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2 గా మూవీ రాబోతోంది. ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడిమోరు దంపతులతో పాటు హిమాంక్ దువ్వూరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు ఈ బ్యానర్‌పై వచ్చిన 'శుభం' సినిమాలో సమంత స్పెషల్ పాత్ర చేశారు.
టీజర్ అదుర్స్
రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేస్తోంది. సంప్రదాయ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన అబ్బాయి తన పెద్దలకు తెలియకుండా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగివస్తాడు. ఓ సంప్రదాయ ఇల్లాలి పాత్రలో కనిపించిన సమంత... తన కుటుంబానికి ఏదైనా ఆపద వస్తే కాళిగా మారి యాక్షన్ మోడ్‌లోనూ అదరగొట్టారు.
























