Saleem Khan: ఆస్పత్రిలో సల్మాన్ ఖాన్ తండ్రి... అసలు ఏమైంది? ఇప్పుడు సలీం ఖాన్‌కు ఎలా ఉందంటే?
Salim Khan Health Update: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు ఆయన ఐసియులో ఉన్నారు. ఆయనకు ఏమైందంటే?

బాలీవుడ్ కండల వీరుడు, ప్రముఖ కథానాయకుడు సల్మాన్ ఖాన్ తండ్రి, సీనియర్ రచయిత సలీం ఖాన్ (Salim Khan)ను ఫిబ్రవరి 17వ తేదీ, మంగళవారం ముంబైలోని లీలావతి హాస్పిటల్ (Lilavati Hospital Mumbai)లో చేర్పించారు. సల్మాన్ సైతం ఆసుపత్రిలో కనిపించారు. ఆ తర్వాత అల్విరా అగ్నిహోత్రి, ఆయుష్ శర్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. దాంతో సలీం ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు అసలు ఏమైందంటే?
సలీమ్ ఖాన్ గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే... ఆయన్ను ICUలో ఎందుకు చేర్పించారనేది ముంబై జర్నలిస్ట్ విక్కీ లల్వానీ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఆసుపత్రిలో ఎందుకు చేర్పించారంటే?
విక్కీ లల్వానీ తెలిపిన వివరాల ప్రకారం... "ఇంట్లో సలీం ఖాన్ చాలాసార్లు పడిపోయారు. ఆ తరువాత సల్మాన్ ఖాన్, కుటుంబ సభ్యులు ఆయన్ను లీలావతి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం సలీం సాహెబ్ ICUలో ఉన్నారు. నరాల్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు" అని చెప్పారు.
ICUలో చేరినట్లు ధృవీకరించిన డాక్టర్లు!
ఇప్పుడు సలీం ఖాన్ వయసు 90 ఏళ్లు. ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ జలీల్ పార్కర్ PTIతో మాట్లాడుతూ... మంగళవారం ఉదయం 8:30 గంటలకు సలీం ఖాన్ ICUలో చేరినట్లు ధృవీకరించారు. "ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. మా వైద్య బృందం ఆయన పరిస్థితిపై నిశితంగా పరిశీలిస్తోంది" అని అన్నారు.
Also Read: Tollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా
ఇంకా డాక్టర్ జలీల్ పార్కర్ మాట్లాడుతూ "ఆయన్ను (సలీం ఖాన్), ఫ్యామిలీ డాక్టర్ సందీప్ చోప్రా అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకు వచ్చారు. సలీం ఖాన్‌ను మొదటి అంతస్తులోని ఇంటెన్సివ్ కేర్ లోకి మార్చాం. డాక్టర్ వినయ్ చవాన్ (నరాల వైద్యుడు), డాక్టర్ అజిత్ మీనన్ (హృద్రోగ నిపుణుడు), డాక్టర్ నితిన్ డాంగే (నాడీ శస్త్రవైద్యుడు), డాక్టర్ బినిత్ అహ్లువాలియా వైద్యుల బృందం చికిత్స చేశారు" అని అన్నారు.
సలీం ఖాన్ కెరీర్ విషయానికి వస్తే... జావేద్ అక్తర్‌తో కలిసి పలు హిట్, క్లాసిక్ సినిమాలకు పని చేశారు. సలీం - జావేద్ పేరు బాక్సాఫీస్‌లో కోట్లు కలెక్ట్ చేసింది. 'సీతా ఔర్ గీతా', 'జంజీర్', 'దివార్', 'షోలే', 'త్రిశూల్', 'క్రాంతి', 'డాన్' వంటి ఐకానిక్ సినిమాలు వాళ్ల కలం నుంచియ వచ్చాయి. ఇక, సల్మాన్ కొత్త సినిమా గురించి చెప్పాలంటే... త్వరలో 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Also Read: Karthi New Movie: తెలుగు దర్శకుడితో కార్తీ సినిమా... కామెడీ ఫుల్లుగా ఉంటుందా?























