Kalki 2898AD Sequel: 'కల్కి' సీక్వెల్‌లో ఆ హీరోయిన్? - ఎవరూ ఊహించి ఉండరు... నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదు
Kalki Sequel Actress: ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి దీపికా పదుకోన్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రోల్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుకుంటున్నారట.

Prabhas's Kalki 2898 AD Sequel Actress: బాక్సాఫీస్ సెన్సేషన్ హిట్ 'కల్కి 2898 AD' సీక్వెల్ ప్రాజెక్టు నుంచి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను తప్పించిన తర్వాత ఆ పాత్ర ఎవరు చేస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అఫీషియల్‌గా దీపికాను తప్పిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియా కొద్ది రోజుల పాటు దీనిపై పెద్ద చర్చే సాగింది. ఈ మూవీలో హీరోయిన్‌ను నాగ్ అశ్విన్ సెలక్ట్ చేశారంటూ లేజెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీక్వెల్‌లో హీరోయిన్ ఎవరంటే?
'కల్కి'లో దీపికా పదుకోన్ 'సుమతి' అనే పాత్రలో నటించి మెప్పించారు. సీక్వెల్‌లోనూ ఆమె రోల్‌కు అత్యంత ప్రాధాన్యముంది. అయితే, ఈ ప్రాజెక్టు నుంచి దీపికాను తప్పించడంతో నెక్స్ట్ ఎవరు ఈ రోల్ చేస్తారనే హైప్ నెలకొంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ రోల్ కోసం ఆలియా భట్‌ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ వరుస ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండడంతో ఇప్పుడు సాయి పల్లవి అయితే బాగుంటుందని భావిస్తున్నారట. సాయి పల్లవి తన అందం, డ్యాన్స్‌తో తెలుగింటి అమ్మాయిగా అందరి మనసులు గెలుచుకున్నారు. మరి ఆమెను నాగ్ అశ్విన్ అప్రోచ్ అవుతారా? సాయి పల్లవి ఓకే చెబుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఇక దీపికా ప్లేస్ భర్తీ చేసే హీరోయిన్‌పై మరో రూమర్ కూడా వినిపిస్తోంది. 'కాంతార చాప్టర్ 1'లో తన నటనతో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్ పేరును కూడా నాగ్ అశ్విన్ పరిశీలిస్తున్నారట.
Also Read: అనసూయ 'అరి' ట్రైలర్ వచ్చేసింది - డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉంటుందంటే?
ఎవరూ ఊహించలేదు!
నిజానికి దీపికాను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. అయితే, వర్కింగ్ అవర్స్, రెమ్యునరేషన్, ఫెసిలిటీస్ విషయంలో కొన్ని కారణాలతో ఆమెను భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పించారనే వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల వరకూ సోషల్ మీడియాలో దీపికా ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా జరిగింది. ఇక ఆమె స్థానంలో వీరిని తీసుకుంటే బాగుంటుంది అంటూ కొందరు పెద్ద చర్చే పెట్టారు.
దీపికా స్థానాన్ని భర్తీ చేసేది స్వీటీ అనుష్క మాత్రమేనని... ఆమెనే తీసుకోవాలని అంతా సూచించారు. ఇక 'కొత్త లోక'తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ పేరు కూడా వినిపించింది. అయితే, సాయి పల్లవి అనే ఆలోచనే ఎవరికీ రాలేదు. కానీ ఇప్పుడు ఆమెనే ఈ రోల్ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ సంప్రదించనున్నారనే వార్తల నేపథ్యంలో అంతా ఆశ్చర్యపోతున్నారు. సీక్వెల్ స్టోరీకి, ప్రభాస్‌కు జోడీగా ఆమె అయితేనే బాగుంటుందని అశ్విన్ భావిస్తున్నారట. ఈ పెయిర్ కూడా బాగానే ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీపికా ప్లేస్‌లో ఎవరిని తీసుకుంటారు? అనేది అటు మూవీ టీం, ఇటు డైరెక్టర్ అఫీషియల్‌గా ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
షూటింగ్ ఎప్పుడు
2024లో వచ్చిన 'కల్కి 2898 AD' డైరెక్టర్ ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించి సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ మూవీ. ఇక సీక్వెల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికీ టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజాసాబ్', 'స్పిరిట్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ సైతం రజినీతో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తైన తర్వాత 'కల్కి 2' షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.





















