Sai Pallavi About Her Acne and Makeup Look: ఇప్పటి హీరోయిన్లలో సాయి పల్లవి (Sai Pallavi) ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందరి హీరోయిన్‌లా కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటుంది. ఎంత పెద్ద పాత్ర అయినా గ్లామర్ షో అంటే నిర్మోహమాటంగా నో చెప్పేస్తుంది. దీంతో దర్శక-నిర్మాతలు సైతం సాయి పల్లవి నిర్ణయానికే ఓటేస్తున్నారు. అలా సెలక్టివ్‌గా సినిమాలు, పాత్రలు చేస్తూ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
హీరోయిన్ అంటే మేకప్, గ్లామర్ షో తప్పనిసరి. కానీ, సాయి పల్లవి మాత్రం ఆ రెండింటికి దూరమే. తెరపై సైతం న్యాచులర్‌గా నటిస్తుంది. మేకప్ లేకుండానే తెరపై తన స్క్రీన్‌పై ప్రజెన్స్ ఆకట్టుకుంటుంది. సాయి పల్లవి (Sai Pallavi About Her Acne) అందంగా కనిపించడానికి ఆమె మొటిమలు కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు. 'అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే' అనే పాటలో సరిగ్గా సాయి పల్లవి సూట్ అవుతుంది. సాయి పల్లవి ముఖంపై ఆ మొటిమలె అందం అంటారు. తాజాగా దీనిపై సాయి పల్లవి కూడా స్పందించింది.
తన తొలి సినిమా ప్రేమమ్, ఫిదా టైంలో సాయి పల్లవి మొఖంపై ఎక్కువగా మొటిమలు కనిపించాయి. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. దీంతో మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? అని ఇటీవల ఓ ఇంటర్య్వూలో సాయి పల్లవికి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. "ఒక వయసు వరకు అమ్మాయిల్లో మొటిమలు అనేవి సాధారణం. నిజానికి నాకు తొలి అవకాశం 'ప్రేమమ్' ఆఫర్ రావడానికి కారణం కూడా అవే. ఒక వయసు వచ్చాక అవి పోతాయి. నాకు అంతే మొటిమలు పోయాయి. వాటికి ప్రత్యేకంగా నేను ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోలేదు" అని చెప్పుకొచ్చింది. అలాగే తన ఒత్తైనా జుట్టుకు కారణం తాను ఎక్కువగా ఆర్గానికి ఫుడ్ తీసుకుంటానని, ఎక్కువగా ఆలోవేరా జల్ యూజ్ చేస్తానని చెప్పింది.
Also Read: డైరెక్టర్ సుకుమార్ కూతురు అరుదైన ఘనత - అతిచిన్న వయసులోనే ఆమెకు 'దాదా సాహెబ్ ఫాల్కే'అవార్డు
కాగా ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో 'తండేల్' (Naga Chaitanya Tandel Movie) మూవీ చేస్తుంది. అలాగే బాలీవుడ్‌లో డైరెక్టర్ నితీష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామయణ్'లో సీతగా నటిస్తుంది. ఇక మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఈ మూవీ హిట్ ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది ఈ బ్యూటీ. దీంతో తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆపర్స్ అందుకుంటుంది. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాలో 'భానుమతి' పాత్రలో పక్కింటి అమ్మాయిలా కనిపించి మెప్పించింది. భానుమతి హైబ్రిడ్ పిల్లా అనే డైలాగ్‌తో సాయి పల్లవి బాగా ఆకట్టుకుంది.