'కేజీయఫ్' స్టార్ యష్ కొత్త సినిమా 'టాక్సిక్' నిరంతరం వార్తల్లో ఉంటోంది. ఇటీవల సినిమా నుంచి నలుగురు అందాల భామల ఫస్ట్ లుక్స్ బయటకు వచ్చాయి. కియారా అడ్వాణీ, హుమా ఖురేషి, తారా సుతారియా, నయనతార... నలుగురు హీరోయిన్లు తమ తమ లుక్స్‌తో యష్ ఫ్యాన్స్, ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు 'టాక్సిక్' నుంచి 'సప్త సాగరాలు దాటి', 'కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1' సినిమాల ఫేమ్ రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.
మెలిస్సాగా మోడ్రన్ డ్రస్‌లో రుక్మిణీ వసంత్'టాక్సిక్'లో ఇంతకు ముందు ఇతర హీరోయిన్స్ లుక్స్ విడుదల చేసినట్టే, రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్‌ను కూడా యష్ పరిచయం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ... ''మెలిస్సా పాత్రలో రుక్మిణీ వసంత్. ఆమెకు 'టాక్సిక్- ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్'లోకి స్వాగతం'' అని క్యాప్షన్‌లో రాశారు యష్. ఫస్ట్ లుక్‌లో రుక్మిణీ వసంత్ గ్లామరస్ స్టైల్‌లో కనిపిస్తున్నారు. స్టైలిష్ హెయిర్ స్టైల్, మోడ్రన్ డ్రెస్‌లో రుక్మిణి అదరగొట్టారు. చేతుల్లో క్లచ్ పర్సు పట్టుకుని కనిపిస్తున్నారు.
Also Read: రాజా సాబ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ప్రభాస్ సినిమా క్లైమాక్స్ అదిరిందట - టాక్ ఏమిటంటే?
రుక్మిణీ వసంత్ కంటే ముందు ‘టాక్సిక్’ నుండి కియారా అడ్వాణీ, హుమా ఖురేషి, తారా సుతారియా, నయనతార లుక్స్ బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు యష్ తప్ప మరొక మేల్ స్టార్ లుక్ బయటకు రాలేదు. ఇంకా ఈ సినిమాలో ఎవరి గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. వరుసగా కేవలం హీరోయిన్ల లుక్స్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Also Read: జనసేనానికి వ్యతిరేకంగా... లేదంటే ఆ వీడియోలు విడుదల చేస్తాం - పూనమ్ కౌర్‌కు బెదిరింపులు
సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'టాక్సిక్'. మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. యష్ ఫ్యాన్స్ ఈ సినిమా టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 8న సినిమా టీజర్ విడుదల కావచ్చు. అయితే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
Also Read: బాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సీక్వెల్... అదీ 25 ఏళ్ళ తర్వాత - 'నాయక్ 2' ఫిక్స్ గురూ