Roshan Meka's Emo Emo Idi First Breeze Out Now : శ్రీకాంత్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక, 'హిట్ 3' ఫేం శైలేష్ కొలను కాంబోలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతోన్న సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా తాజాగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

Continues below advertisement

క్యూట్ టైటిల్‌ విత్ గ్లింప్స్

ఈ మూవీకి 'ఏమో ఏమో ఇది' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రోషన్ సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఓ కాఫీ షాప్‌లో తల్లీ కొడుకుల మధ్య జెన్ జీ లవ్, పెళ్లి గురించి సరదా సంభాషణతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత జనరేషన్‌లో బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? అంటూ రోషన్... జెన్ జీ పదాలతో ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది.

Continues below advertisement

ఇక ఇదే కాపీ షాప్‌లో హీరోయిన్ అలనాటి క్లాసిక్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంది. ఈ సీన్‌తో లవ్, ఎమోషనల్ టచ్‌ను అందంగా చూపించారు. అభయ్‌గా రోషన్ కనిపించనుండగా... ప్రీతి ముకుందన్ అపూర్వగా కనిపించనున్నారు.

నో వయలెన్స్... ఓన్లీ లవ్

బ్లాక్‌ బస్టర్ 'హిట్' యూనివర్స్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు శైలేష్ కొలను. లేటెస్ట్ 'ఏమో ఏమో ఇది'తో పూర్తిగా కొత్త జానర్‌లో అడుగు పెడుతున్నారు. ఎప్పుడూ యాక్షన్, ఇన్వెస్టిగేషన్ వంటి అంశాలతో మూవీస్ తీసిన ఆయన ఇప్పుడు కంప్లీట్ రొమాంటిక్ లవ్ కామెడీ జానర్‌లో మూవీ చేయబోతున్నట్లు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతోంది. నేటి జెన్ జీ తరం ప్రేమను ఆవిష్కరించే పక్కింటి అబ్బాయి తరహా ఆకర్షణీయమైన పాత్రలో రోషన్ కనిపించనున్నారు.

Also Read : విశ్వక్ 'ఫంకీ' ఓపెనింగ్ డే కలెక్షన్స్ - మాస్ కా దాస్ కామెడీ ఎంటర్టైనర్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

ఈ మూవీకి మలయాళ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించనున్నారు. ఆయన 'హాయ్ నాన్న', 'ఖుషి', '8 వసంతాలు', 'ది గర్ల్ ఫ్రెండ్', 'మామన్' వంటి మూవీస్‌కు మ్యూజిక్ అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

'ఏమో ఏమో ఇది' టీం - తారాగణం: రోషన్ మేకా, ప్రీతి ముకుందన్, దర్శకత్వం: శైలేష్ కొలను, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.