Rishab Shetty Unfollows Kantara Co Stars : 'కాంతార'తో వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. రీసెంట్‌గా వచ్చిన 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీలను నిర్మించింది. కాంతార 3 కూడా ఉంటుందని... కాంతార చాప్టర్ 1 క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చారు. ఇటీవలే హోంబలే ఫిల్మ్స్‌తో హీరో రిషబ్‌కు విభేదాలు వచ్చినట్లు ప్రచారం సాగింది.

Continues below advertisement

వారిద్దరినీ అన్ ఫాలో...

ఈ ప్రచారానికి హీరో రిషబ్ చేసిన పని తాజాగా బలం చేకూర్చింది. తన సహ నటీనటులను ఇన్ స్టాలో అన్ ఫాలో చేశారు. ప్రస్తుతం ఇది కన్నడ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ బి శెట్టిలతో పాటు హీరోయిన్ రుక్మిణి వసంత్‌లను రిషబ్ శెట్టి అన్ ఫాలో చేశారు. అలాగే, కాంతార నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ను కూడా అన్ ఫాలో చేశారు. దీంతో కొన్ని రోజులుగా కాంతార టీంతో డిఫరెన్సెస్ ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూరింది.

Continues below advertisement

అయితే, హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్‌ను మాత్రం ఆయన ఇంకా ఫాలో అవుతున్నారు. మరి ఆ ఇద్దరినీ అన్ ఫాలో చేయడంపై ఇప్పటివరకూ అటు నిర్మాణ సంస్థ కానీ, ఇటు రిషబ్ శెట్టి కానీ స్పందించలేదు. రిషబ్ అధికారికంగా స్పందిస్తే తప్ప రూమర్లకు చెక్ పడదు.

Also Read : తల్లిగా మాత్రమే చేయనని చెప్పా - ప్రభాస్‌తో యాక్టింగ్... రూమర్స్‌పై రాశి రియాక్షన్

'కాంతార 3' పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం రిషబ్... ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో ఆయన హనుమంతుడి పాత్ర పోషిస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక కాంతార, కాంతార చాప్టర్ 1 తర్వాత కాంతార 3పై ఆడియన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ రెండు పార్టులను మించి ఈ మూవీ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

ఇంతలో హోంబలే ఫిల్మ్స్‌ను రిషబ్ అన్ ఫాలో చేయడంపై అందరిలోనూ సస్పెన్స్ నెలకొంది. అసలు కాంతార 3 ఉంటుందా? నిజంగా డిఫరెన్సెస్ ఏమైనా వచ్చాయా? వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది రిషబ్ శెట్టి రియాక్ట్ అయితే తప్ప క్లారిటీ రాదు.