Rishab Shetty Remuneration For Jai Hanuman Movie : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ ఎపిక్ 'హను మాన్'. 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం 'జై హనుమాన్' టైటిల్‌తో సీక్వెల్ తెరకెక్కుతుండగా... రీసెంట్‌గానే హిస్టారికల్ ప్లేస్ హంపీలోని అంజనాద్రిపై పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది.
రిషబ్ రెమ్యునరేషన్ ఎంతంటే?
సీక్వెల్‌లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ కోసం ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో ఆయన రెండు ఆప్షన్స్ అనుకుంటున్నట్లు ఫిలింనగర్ సర్కిల్లో ప్రచారం సాగుతోంది. మొదటిది... రూ.20 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో 33 శాతం వాటా. రెండోది... లాభనష్టాలతో సంబంధం లేకుండా టోటల్ రూ.80 కోట్ల రెమ్యునరేషన్.
హీరో రిషబ్ ఫస్ట్ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతుండగా... నిర్మాతలు రెండో ఆప్షన్ బెటర్ అని అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆయన ఏది ఫైనల్ చేస్తారనేది మరో వారంలో తేలిపోతుందట. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేయగా హైప్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు, హీరో తేజ సజ్జా ఈ ప్రాజెక్ట్ కోసం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. హనుమాన్, మిరాయ్ వంటి బిగ్ సక్సెస్‌లతో తేజ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంటున్నారు.
Also Read : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
సీక్వెల్ స్టోరీ ఏంటంటే?
జై హనుమాన్ ఫస్ట్ పార్ట్‌ను మించి ఉండనుందని ఇదివరకే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేశారు. ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'హను మాన్'లో హనుమంత్‌గా కనిపించిన తేజ సజ్జా సీక్వెల్‌లోనూ అదే రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హనుమంతుడిగా రిషబ్ శెట్టి, మరో కీలక పాత్రలో హీరో రానా దగ్గుబాటి నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే షూటింగ్ అప్డేట్స్‌తో ఇతర వివరాలు సైతం వెల్లడి కానున్నాయి.
చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ సినిమాలు చూస్తూ సూపర్ పవర్స్‌పై పిచ్చితో అడ్వెంచర్స్ చేయాలనుకునే విలన్ స్టోరీకి మైథలాజికల్ టచ్ ఇస్తూ ఫస్ట్ పార్ట్‌ను రూపొందించారు. తేజ సజ్జాతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని కీలకపాత్రలు పోషించారు. క్లైమాక్స్‌లో హీరో విలన్‌ను దైవ శక్తితో అంతం చేయగా... శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనేది సస్పెన్స్. సీక్వెల్‌లో దీనిపై క్లారిటీ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా 'జై హనుమాన్' తెరకెక్కనుంది.
Also Read : న్యూ టాలెంట్... ప్రొడ్యూసర్ హీరో కిరణ్ అబ్బవరం - తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ ఎప్పుడంటే?
