Renu Desai Fires On Killing Dogs : దేశంలో వీధి కుక్కల్ని చంపేస్తున్న వారిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ మండిపడ్డారు. ఏడాదిలో లక్షలాది మంది దోమ కాటు వల్ల చనిపోతున్నారని... ఆ ప్రాణాలకు విలువ లేదా అంటూ తాజా ప్రెస్ మీట్‌లో ప్రశ్నించారు. కుక్క కాటుతో మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు హత్యలు, రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలపై ఎందుకు రియాక్ట్ కావడం లేదని ప్రశ్నించారు.
కుక్క కరిచి చనిపోతేనే ప్రాణమా?
కుక్క కరిచి మనిషి చనిపోతేనే అది ప్రాణమా? అని ప్రశ్నించారు రేణు దేశాయ్. 'కొందరు డాగ్ హేటర్స్ కావాలనే ఇలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు. మీకు మనిషి ప్రాణం గురించి ఏమీ లేదు. కేవలం కుక్క మీద విరక్తి, కోపంతోనే మనిషి ప్రాణం తీసేస్తుందంటూ మాట్లాడుతున్నారు. సెలక్టివ్‌గానే ఎందుకు కుక్కలను టార్గెట్ చేస్తున్నారు. రోజులో ఎంతోమంది హత్యకు గురవుతున్నారు. చిన్నారులు అత్యాచారాలకు గురవుతున్నారు. అప్పుడు మీ మానవత్వం ఎక్కడికి పోయింది.
మీ ఇంటి పక్కనే చిన్నారులను లైంగికంగా వేధించే వారు చాలామంది ఉంటారు. అప్పుడు మీరేం చేస్తారు. రోడ్డుపై హెల్మెట్ లేకుండా ఎంతోమంది యువకులు, స్టూడెంట్స్ చనిపోతున్నారు. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు. హెల్మెట్ వేసుకోకుండా ప్రమాదాల్లో చనిపోయిన ప్రాణాలకు విలువ లేదా? ఓ కుక్క కరిచి ప్రాణం పోతే ఆ ప్రాణానికే విలువా?' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ - స్పెషల్ సాంగ్స్‌కు కండీషన్... నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
మగాళ్లందరినీ చంపేయాలా?
కుక్కలన్నీ ప్రమాదకరం కాదని... ఎక్కడో ఏదో ఒకటి హాని కలిగించిందని... వందల కుక్కలను చంపేస్తున్నారని మండిపడ్డారు రేణు దేశాయ్. 'మీకు నిద్ర ఎలా పడుతుంది? కచ్చితంగా కర్మ అనేది అనుభవిస్తారు. కొంత మంది మగాళ్లు రేప్, మర్డర్ చేస్తారా లేదా? అలా అని అందరూ రేపిస్టులా? అందరినీ జైల్లో పెట్టాలా? అందరినీ చంపేయాలా? కొంచెమైనా బుద్ధి ఉందా? ఐదు కుక్కలు కరిస్తే మిగిలిన వంద కుక్కలను ఎందుకు చంపుతున్నారు?' అంటూ ప్రశ్నించారు.
మాకు సమాచారం ఇవ్వండి
రీసెంట్‌గా నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ వందల కుక్కలను చంపడం అమానవీయమని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'కుక్కలవి మాత్రం ప్రాణాలు కాదా? కుక్కే కాదు. ఆవు, గేదె, పిల్లి, కోతి ఇలా అన్నీ ప్రాణులే. మనుషులతో పాటు అన్నింటికీ జీవించే హక్కు ఉంటుంది. మన చుట్టూ ఉన్న అపరిశుభ్ర పరిస్థితులే వీధి కుక్కలు పెరగడానికి కారణం. ఇందుకు కారణమైన సమస్యలపై ఎవరూ రియాక్ట్ కారు. కానీ కుక్కల గురించే మాట్లాడుతారు. ఇదెక్కడి న్యాయం. హాని కలిగించే కుక్కల గురించి నా ఎన్జీవోకు లేదా జీహెచ్ఎంసీకి సమాచారం ఇస్తే వాటిని తాము తీసుకెళ్తాం.' అని అన్నారు.
ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా విఫలం కావడం వల్లే కుక్కలు పెరిగిపోతున్నాయని రష్మీ అన్నారు. వీధి కుక్కలకు ప్రత్యేక షెల్టర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. విదేశీ బ్రీడ్స్ పెంచుకునే యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.