(Source: ECI | ABP NEWS)
Mass Jathara Hudiyo Hudiyo Song : రవితేజ 'మాస్ జాతర' నుంచి లవ్ సాంగ్ - క్యూట్ లిరిక్స్‌తో ప్రోమో
Hudiyo Hudiyo Song Promo: మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' నుంచి లవ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. పూర్తి పాటను ఈ నెల 8న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Ravi Teja's Mass Jathara Hudiyo Hudiyo Song Promo Out: మాస్ మహారాజ్ రవితేజ, టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మాస్ సాంగ్స్ ట్రెండ్ అవుతుండగా... తాజాగా లవ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
క్యూట్ లిరిక్స్... బెస్ట్ మ్యూజిక్
'హుడియో హుడియో' అంటూ స్లో మోషన్‌లో క్యూట్ మ్యూజిక్‌తో సాగే ప్రోమో ఆకట్టుకుంటోంది. 'నా గుండె గాలిపటమల్లే ఎగరేశావే. నీ చుట్టు పక్కల తిరిగేలా గిరి గీశావే. నా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేశావే. నీ కంటి చూపుల్తో కలలను ఉరి తీశావే.' అంటూ సాగే లిరిక్స్ మంచి లవ్ ఫీల్ అందిస్తున్నాయి. పూర్తి పాటను ఈ నెల 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ఫస్ట్ సాంగ్ 'తుమేరా లవర్' ఇప్పటికే ట్రెండ్ అవుతుండగా... ఇక సెకండ్ సాంగ్ 'ఓలే ఓలే' ఉత్తరాంధ్ర భాష, యాసతో ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. తాజాగా వచ్చిన లవ్ సాంగ్ ప్రోమో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. ఈ నెల 31న మూవీ రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్‌గా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై... సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ, శ్రీలీల కాంబోలో ఇది రెండో మూవీ. ఫస్ట్ మూవీ 'ధమాకా' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని అటు మూవీ టీంతో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రవితేజ కెరీర్‌లో ఇది 75వ మూవీ. టైటిల్‌కు తగ్గట్లుగానే మాస్ డైలాగ్స్, సాంగ్స్, కామెడీ, లవ్ ఇలా అన్నీ కలగలిపి ఫ్యాన్స్‌కు ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చేలా 'మాస్ జాతర' ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీతో మాస్ మహారాజ హిట్ కమ్ బ్యాక్ కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. రవితేజ గ్రేస్, మాస్ రేంజ్‌కు ఈ మూవీ ఫర్ఫెక్ట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 'ధమాాకా' తర్వాత అంతటి స్థాయిలో ఆయన ఖాతాలో సరైన హిట్ పడలేదు.
The melody you won’t stop humming once you hear it! 🎶❤️
— Sithara Entertainments (@SitharaEnts) October 6, 2025
Here’s the promo of #HudiyoHudiyo
– https://t.co/GslT6D0EpW
Full song Lyrical out on October 8th! 🎶
A Bheems Ceciroleo Musical 🎹
Sung by @HeshamAWmusic & #BheemsCeciroleo 🤩
✍️ #Dev #MassJathara… pic.twitter.com/nlPbH0y9S4





















