Netizens Torllings On Ravi Teja Comments In Irumudi Pre Release Event : ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజ రవితేజ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతోంది. చిన్నారి నక్షత్రపై ఆయన చేసిన కామెంట్స్ విమర్శలకు దారితీశాయి. నెటిజన్లు ఆయన తీరును తప్పుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

Continues below advertisement

చిన్నారిని ఏమన్నారంటే? 

ఆదివారం ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిన్నారి నక్షత్ర రవితేజను ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. 'నాకు నిక్ నేమ్ పెట్టాలంటే ఏ పేరు పెడతారు?' అంటూ ప్రశ్నించగా... కాసేపు ఆలోచించిన రవితేజ 'ముదురు ము***' అని అన్నారు. దీనికి అర్థం నాకు తెలీదు నక్షత్ర అడిగితే... తర్వాత చెప్తానని రవితేజ నవ్వారు. ఈ వీడియో వైరల్ కాగా... మాస్ మహారాజపై విమర్శలు వస్తున్నాయి.

Continues below advertisement

స్టార్ హీరో అయి ఉండి చిన్నారిపై అలాంటి కామెంట్స్ చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇరుముడి లాంటి డివోషనల్ టచ్ ఉన్న మూవీ వేదికపై ఇలా మాట్లాడడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?

'నన్ను కొత్తగా చూస్తారు'

ఈ సినిమాలో తనను కొత్తగా చూస్తారని చెప్పారు రవితేజ. 'ఈ మూవీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇది మాత్రం బల్ల గుద్ది మరీ చెప్పగలను. సినిమాలో మంచి ఎమోషనల్ రైడ్ ఉంటుంది. మీ రవన్నని చూడబోతున్నారు. చిన్నారి నక్షత్ర అద్భుతంగా నటించింది. ఫ్యూచర్‌లో ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్ అవుతుంది. ఇరుముడి అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది.' అని అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అటు, అజయ్ ఘోష్ స్పీచ్‌లో ఎమోషన్ అవుతూ... కొంచెం పరుష పదాలు వాడారు. దీనిపైనా ట్రోలింగ్ సాగుతోంది. 'అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్ వంటి హీరోలతో కలిసి పనిచేశాను. కానీ, రవితేజతో ఉన్న అనుబంధం చాలా స్పెషల్. ఏ జన్మ బంధమో కానీ ఆయనతో పని చేసినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నిజంగా ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా మాట్లాడడం... నిజంలో బతకడం... నిజంగా ఉండడం మీకే చెల్లింది.' అని రవితేజను ప్రశంసించారు.

ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా... రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే చిన్నారి నక్షత్ర, అజయ్ ఘోష్, సాయి కుమార్ కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఆగస్ట్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Irumudi Mallepoola Pallaki Song : మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.