New Actor Introduced In Lokesh Kanagaraj Cinematic Universe : సినిమాటిక్ యూనివర్స్... ఈ ట్రెండ్ క్రియేట్ చేసింది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఒక సినిమాలోని పాత్రలను మరో సినిమాలో పాత్రలకు లింక్ చేస్తూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ సెట్ చేశారు. కార్తి 'ఖైదీ', కమల్ హాసన్ 'విక్రమ్', విజయ్ 'లియో' ఇందులో భాగమే. ఈ యూనివర్స్‌లో మరో హీరో భాగమయ్యారు. దీనిపై లోకేశ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Continues below advertisement

మరో తమిళ హీరో

తమిళ హీరో రవి మోహన్ (జయం రవి) లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమయ్యారు. లోకేశ్ కొత్త మూవీ 'బెంజ్'లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్‌కు సంబంధించి ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. రాఘవ లారెన్స్ హీరోగా డైరెక్టర్ బక్కియరాజ్ కన్నన్ బెంజ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. మలయాళ స్టార్ నివిన్ పౌలీ విలన్ రోల్ చేస్తున్నారు. మరి రవి మోహన్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో తెలియాల్సి ఉంది.

Continues below advertisement

భార్య ఆర్తి రవితో డివోర్స్, సింగర్ కెనీషాతో బ్రేకప్ వ్యవహారం ఇలా వరుస వివాదాలతో రీసెంట్‌గా వార్తల్లో నిలిచారు రవి మోహన్. డివోర్స్ వచ్చే వరకూ సినిమాలు చేయను అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సింగర్ కెనీషాపై ట్రోలింగ్‌ చేశారంటూ ఆరోపణలు చేశారు. కాంట్రవర్సీస్‌ తర్వాత ఫస్ట్ టైం రవి మోహన్ షూటింగ్‌లో పాల్గొన్నారు.

Also Read : Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్

గతేడాది రిలీజైన రజనీ కాంత్ కూలీ మూవీతో బిగ్ హిట్ అందుకున్నారు లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం ఆయన 'డీసీ' మూవీతో హీరోగానూ ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్‌గా కాటాలన్ క్లైమాక్స్‌లో స్పెషల్ రోల్‌లో మెరిశారు. లియో కార్టెల్ రోల్‌లో లెజెండ్ మార్కో అంటూ అనౌన్స్ చేయగా... మార్కో సినిమాటిక్ యూనివర్స్‌లో ఆయన భాగమయ్యారు. కాటాలన్ సీక్వెల్‌లో ఆయన భాగం కానున్నారు. మరోవైపు, అల్లు అర్జున్‌తో AA23 మూవీని ప్రకటించి సర్ప్రైజ్ చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Also Read : 29 Movie OTT : ఓటీటీలోకి రీసెంట్ తమిళ రొమాంటిక్ డ్రామా - ఐఎండీబీలో 9.1 రేటింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.