Raveena Tandon About Hit And Run Case: ఇటీవల ముంబాయ్‌లో రవీనా టాండన్‌పై జరిగిన దాడి విషయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన కారు ఒక మహిళను ఢీ కొట్టిందంటూ ఆ మహిళకు సంబంధించిన మనుషులు.. రవీనా కారును రోడ్డుపైనే ఆపి దాడి చేశారు. అయితే ఈ విషయంపై రవీనా మాత్రమే కాదు.. ఇంకా ఏ ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందించలేదు. కంగనా మాత్రమే తనకు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. కానీ ఫైనల్‌గా దీనిపై స్పందించాలని రవీనా టాండన్ నిర్ణయించుకుంది. ఈ ఘటనలో తన తప్పు ఏం లేదనే అర్థం వచ్చేలా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది.


అందరికీ థాంక్యూ..


తాజాగా ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసినా రవీనా టాండన్.. ముందుగా తనకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పుకుంది. ‘మీరు ప్రేమకు, నమ్మకానికి, సపోర్ట్‌కు థాంక్యూ. ఈ కథలో నీతి ఏంటని అడుగుతారా? డ్యాష్‌ కెమెరాలు, సీసీటీవీలు ఇప్పుడే తెప్పించండి’’ అని తెలిపింది. తన కారుకు అవే ఉంటే.. అసలు విషయం తెలిసేదన్నట్లుగా రవీనా ఈ పోస్ట్ పెట్టింది. వాస్తవానికి.. రవీనా చెప్పినట్లు వాహనాలకు డ్యాష్ కెమేరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అవే సాక్ష్యాలుగా ఉంటాయి. పోలీస్ కేసుల నుంచి తప్పించుకోవచ్చు. రవీనా కూడా ఈ కేసు నుంచి అలాగే బయటపడింది. సీసీటీవీ కెమేరా ఫూటేజ్ పరిశీలించిన పోలీసులు.. ఆ ప్రమాదంలో రవీనా తప్పేమీ లేదని తేల్చారు. ఆ కెమేరాలే లేకపోతే రవీనా పరిస్థితి మరోలా ఉండేది.


వారం రోజుల క్రితం..


జూన్ 1న కార్టర్ రోడ్డులోని రిజ్వీ కాలేజ్ దగ్గర తన కారు ర్యాష్ డ్రైవింగ్‌తో వచ్చి ఒక మహిళను ఢీ కొట్టిందంటూ రవీనా టాండన్‌పై కేసు నమోదయ్యింది. అయితే ఈ విషయం పోలీసులకు వరకు వెళ్లకముందే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహిళను ఢీ కొట్టారంటూ రవీనా చుట్టూ కొంతమంది చేరి తనను కొట్టడం మొదలుపెట్టారు. దాడి చేసినవారు చెప్పినదాని ప్రకారం.. రవీనా కారు ర్యాష్‌గా వచ్చి మహిళను ఢీ కొట్టడంతో పాటు తను కారులో నుంచి వారిని దూషించడం మొదలుపెట్టిందని వారు ఆరోపించారు. అందుకే వారు దాడి చేశామని తెలిపారు. కానీ ఇందులో ఏది పూర్తిగా నిజమని ఇప్పటికీ తెలియలేదు.


యాక్సిడెంట్ జరగలేదు..


ఈ దాడికి సంబంధించి వైరల్ అయిన వీడియోలో మాత్రం రవీనా టాండన్ చుట్టూ చేరిన గుంపును తనను కొట్టవద్దని బత్రిమిలాడింది. ఇప్పటివరకు పోలీసులు పరిశీలించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రవీనా కారు.. ఎవరినీ ఢీ కొట్టలేదు. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా బయటపెట్టారు. దీంతో రవీనాపై కొందరు కావాలనే కేసు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పైగా బాలీవుడ్‌లో ఎవరూ దీనిపై స్పందించకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు. బీ టౌన్‌లో జరిగే ప్రతీ కాంట్రవర్సీపై స్పందించే కంగనా మాత్రమే దీని గురించి పోస్ట్ చేసిందని గుర్తుచేస్తున్నారు.


Also Read: 'హమారే బారా' మూవీపై కొనసాగుతున్న దుమారం, విడుదలపై నిషేధం విధించిన ప్రభుత్వం