తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా 'పరాశక్తి' (Parasakthi Movie). ఇందులో ఆయనకు జంటగా తెలుగు అమ్మాయి, యువ కథానాయిక శ్రీ లీల (Sreeleela) నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం 'సింగారాల సీతాకోకవే...' పాట విడుదల అయ్యింది. తాజాగా 'రత్నమాల' పాట విడుదల చేశారు. ఆ సాంగ్ లిరిక్స్ చూస్తే...

Continues below advertisement

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో...రామ జోగయ్య శాస్త్రి రాసిన 'రత్నమాల''పరాశక్తి' సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 'రత్నమాల...' పాటకు ఆయన బాణీ సమకూర్చడంతో పాటు తెలుగులోనూ స్వయంగా ఆయనే ఆలపించారు. ఈ పాటకు సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అనురాగ్ కశ్యప్ హిందీ లిరిక్స్ రాశారు. ఈ పాటలో శివకార్తికేయన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ... వాళ్ళిద్దరి స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి సాంగ్ లిరిక్స్ చూస్తే...  

పల్లవిరత్నమాల రత్నమాల.. నా జా తు ఐసే ముఝే చోడ్ కేరత్నమాల రత్నమాల.. చాంద్ మేరే నైనోన్ సే చీన్ కేలేనిపోని అలకవే.. ఉలకవే.. పలకవే..నీ మోమందాలు చెరిపే.. మూతి ముడుపే మానుకోవేరత్నమాల రత్నమాల.. నన్ను వీడి నువ్వలా పోరాదెరత్నమాల రత్నమాలా.. మిన్ను విడి వెన్నెల పోరాదె

Continues below advertisement

కోరస్!బాల.. బంగారు బాలా..వేళా.. సంతోష వేళా..ఏలా.. చెల్లాటాలేలా..రాజీ పడిపోతే పోలాకోలా కోపాల కళ్లా..గుచ్చే గులాబీ ముళ్లా..ఇల్లా మనసైన వాళ్లా..నీల్లా ఉడికిస్తే ఎల్లా..

చరణం 1అరెరే పూల గొలుసాఇదిలా ఏమి వరసబిగించి గొంతు ఊపిరాపకే..శిక్షించబోకే.. చిన్నదానికేనాపైన కోపం సరే.. నీ కన్ను ఎరుపైనదే..కంగారు పడతున్నదే.. నా ప్రాణం నీకై..

కోరస్!బాల.. బంగారు బాలా..వేళా.. సంతోష వేళా..ఏలా.. చెల్లాటాలేలా..రాజీ పడిపోతే పోలాకోలా కోపాల కళ్లా..గుచ్చే గులాబీ ముళ్లా..ఇల్లా మనసైన వాళ్లా..నీల్లా ఉడికిస్తే ఎల్లా..

రత్నమాల రత్నమాలా.. మిన్ను విడి వెన్నెల పోరాదె

Also Read: Gira Gira Gingiraagirey Song Lyrics: గింగిరాగిరే లిరిక్స్... ట్రెండింగ్‌లో రోషన్ మేక - అనస్వర రాజన్‌ల 'ఛాంపియన్' ఫస్ట్ సాంగ్... కాసర్ల శ్యామ్ ఏం రాశారంటే?

చరణం 2ఓ.. ఓరగా ఓ చిరునవ్వు..ఇటుగా జారనివ్వు..ఉదయాన్ని చీల్చు సూర్య రేఖలా..పెదవంచులోనే.. ఆగిపోకలా..ఇక చాల్లే ఈ పూటకి.. దిగి రావే నా మాటకి..విరాహానా ముంచకే ప్రేమ కాలాన్ని రానీ..రత్నమాల రత్నమాల.. నన్ను వీడి నువ్వలా పోరాదెరత్నమాల రత్నమాలా.. మిన్ను విడి వెన్నెల పోరాదెలేనిపోని అలకవే.. ఉలకవే.. పలకవే..నీ మోమందాలు చెరిపే.. మూతి ముడుపే మానుకోవే

Also Readరెబల్ సాబ్ సాంగ్ లిరిక్స్... పాన్ ఇండియా No1 బ్యాచిలర్ ప్రభాసేలే - ట్రెండింగ్‌లో ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్!

'పరాశక్తి' సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి తెలుగులో స్టార్ హీరోలు నటించిన సినిమాలు నాలుగైదు ఉన్నాయి. మరి 'పరాశక్తి' వారం ఆలస్యంగా వస్తుందో? లేదంటే అదే విడుదల తేదీకి థియేటర్లలోకి వస్తుందో? వెయిట్ అండ్ సి. ఈ సినిమాలో రవి మోహన్, అథర్వ కీలక పాత్రలు పోషించారు.