Rashmika Mandanna : ఎవరూ ఊహించని రోల్‌లో రష్మిక! - బాలీవుడ్ మీడియా వార్తల్లో నిజమెంత?
Rashmika New Role : ఇదివరకు ఎన్నడూ చేయని ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ రోల్‌లో రష్మిక నటించనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Rashmika Mandanna To Play Lesbian Role In Cocktail 2 Movie : వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ రష్మిక. రోల్ ఏదైనా తనదైన యాక్టింగ్‌తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా'లో చేస్తుండగా పవర్ ఫుల్ వారియర్‌గా అందులో కనిపించనున్నారు. ఇక 'రణబాలి'లోనూ ఆమె పాత్ర అంతే పవర్ ఫుల్‌గా ఉండనుందని అర్థమవుతోంది. తాజాగా, బాలీవుడ్‌లో నేషనల్ క్రష్ తర్వాత ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ఆ పాత్రలో స్టార్ హీరోయిన్సా?
బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ 'కాక్‌టెయిల్ 2'. 2012లో దీపికా పదుకోన్, డయానా, సైఫ్ అలీ ఖాన్ నటించిన రోమ్ కామ్ 'కాక్‌టెయిల్'. హోమీ అదాజానియా దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'కాక్ టెయిల్ 2' రానుంది.
షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమాలో కృతి సనన్, రష్మిక నటించనున్నారు. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అయితే, రష్మిక, కృతి రోల్స్‌పై బాలీవుడ్ మీడియాలో తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సినిమాలో రష్మిక, కృతి స్వలింగ ప్రేమికులుగా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అంటే లెస్బియన్ రోల్స్ చేయనున్నట్లు సమాచారం. బాలీవుడ్ మూవీస్‌లో ఈ పాయింట్ టచ్ చేయడం అప్పుడప్పుడూ సహజమే. కానీ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఆ రోల్స్ చేస్తున్నారా? అనేదే ఇప్పుడు చర్చ. రష్మిక ఈ రోల్ చేయడానికి ఒప్పుకున్నారా? అనేది కూడా సస్పెన్స్. వీరి పాత్రల గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాకపోయినా ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read : అనుపమ క్యూట్ సెల్ఫీ విత్ ధ్రువ్ విక్రమ్ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ కన్ఫర్మ్ అంటూ...
హోమీ అదాజానియా దర్శకత్వంలోనే 'కాక్‌టెయిల్ 2' కూడా రానుంది. జనవరి 31నే షూటింగ్ పూర్తి కాగా... త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడిస్తామని మూవీ టీం తెలిపింది. ఇప్పటివరకూ చూడని పాత్రలో షాహిద్ కనిపించనున్నారని మేకర్స్ తెలిపారు.
























