Rashmika Mandanna's Girl Friend Movie Teaser Song Unvieled: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna), యంగ్ హీరో దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) జంటగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girl Friend). ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. శనివారం రష్మిక బర్త్ డే సందర్భంగా మూవీ టీం టీజర్ సాంగ్‌ను రిలీజ్ చేసింది.

రేయి లోలోతుల అంటూ గుండెను తాకింది

'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ నుంచి వచ్చిన 'గుండె లోలోతుల' పాట యూత్ హృదయాలను తాకేలా ఉంది. 'నయనం నయనం కలిసే తరుణం. యదనం పరుగే పెరిగే వేగం నా కదిలే మనసుని అడిగా సారం.' అంటూ విజయ్ దేవరకొండ వాయిస్‌తో సాగిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. 'రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, యెద జారెనే మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, యెద జారెనే మనసా..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. 

ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించారు. విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటలో స్టార్టింగ్ వచ్చే పోయమ్‌ను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రాశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Also Read: రెండున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

వారియర్‌గా రష్మిక

ఈ పాటతో రష్మిక లుక్ సైతం విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. ఓ చేతిలో కత్తి, గన్‌తో పవర్ ఫుల్ వారియర్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

'కుబేర' నుంచి వీడియో క్లిప్

మరోవైపు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న 'కుబేర' చిత్ర యూనిట్ సైతం రష్మిక బర్త్ డే స్పెషల్‌గా.. ఆమె షూటింగ్ సెట్స్‌లో ఉన్న ఓ వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. 'మా అందమైన రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కుబేరలో మీ నటనలాగే మీ రోజు కూడా ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.' అని పేర్కొంది. కోలీవుడ్ స్టార్ ధనుష్, అక్కినేని నాగార్జున కలిసి చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది.