'బేబీ బేబీ అంటూ నువ్ క్యూట్ గా పిలిచాక... మందే మానేశా, సిగరెట్ పారేసా. అయినా ముంచేశావే' అంటూ తన బాధను వెళ్లగక్కుతున్నారు సంగీత్ శోభన్. అది రియల్ లైఫ్‌లో కాదులెండి, రీల్‌ లైఫ్‌లో. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'రాకాస'. అందులో 'రపప్పా... రపప్పా...' అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేశారు. 

సినిమాలో మొదటి పాట విడుదల!'కమిటీ కుర్రోళ్లు'తో నిర్మాతగా వెండితెరపై అడుగు పెట్టారు నిహారిక కొణిదెల (Niharika Konidela). ఆ సినిమాతో అవార్డులను, రివార్డులను అందుకున్నారు. ఆ తర్వాత జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ మీద నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి 'రాకాస' (Rakasa Movie) నిర్మించారు. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకురాలు. సంగీత్ శోభ‌న్‌ సరసన న‌య‌న్ సారిక‌ నటించారు. ఏప్రిల్ 3న చిత్రాన్ని విడుదల చేయబోతోన్నారు.

Also ReadPolena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

'రపప్పా... రపప్పా' అంటూ సాగిన పాటలో హీరోయిన్ పట్ల హీరోకి ఉన్న ప్రేమ, అదే విధంగా తనకు బదులు వేరే యువకుడిని పెళ్లి చేసుకుంటుందన్న బాధ హీరో చెప్పే విధానంలో కనబడుతోంది. ట్రెండీగా, ఫన్నీగా, యూత్ లాంగ్వేజ్‌లో చెప్పారు. ఈ పాటకు అనుదీప్ దేవ్ అందించిన బాణీ, రఘురాం సాహిత్యం, రామ్ మిర్యాల వాయిస్ ఇన్‌స్టంట్ హిట్ చేశాయి.

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

Rakasa  Movie Cast: సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించిన 'రాకాస'లో వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌, అమ‌న్‌, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) త‌దిత‌రులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి క‌థ‌ - స్క్రీన్‌ ప్లే - మాటలు -  ద‌ర్శ‌క‌త్వం: మాన‌స శ‌ర్మ‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: 'మ‌న్యం' ర‌మేష్‌, ఆడిష‌నల్ స్క్రీన్ ప్లే: మ‌హేష్ ఉప్పాల‌, సంగీతం: అనుదీప్ దేవ్‌, ఛాయాగ్రహణం: రాజు ఎదురోలు.

Also ReadVijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్