Ranveer Singh Visits Chamundeshwari Temple In Mysuru : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మైసూరులోని చాముండేశ్వరి టెంపుల్‌ను మంగళవారం దర్శించుకున్నారు. ఓవైపు 'డాన్ 3' వివాదం నడుస్తుండగా... 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్' బ్యాన్ విధించిన మరుసటి రోజే ఆయన ఆలయ సందర్శన చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Continues below advertisement

కోర్టు ఆదేశాలతో...

గోవాలో గతేడాది జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల ఫంక్షన్‌లో రిషబ్ శెట్టి 'కాంతార' మూవీ గురించి మాట్లాడిన రణవీర్... సినిమాలో పంజుర్లి దేవుడిని ఇమిటేట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అటు కన్నడిగులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎవరి మనోభావాలను దెబ్బతియాలనేది తన ఉద్దేశం కాదని... రిషబ్ శెట్టి ఆ పాత్ర అద్భుతంగా చేశారనే చెప్పడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు.

Continues below advertisement

సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు రణవీర్. అయితే, ఆయన సారీలో నిజాయతీ లేదంటూ ఓ లాయర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. కాంతారలోని పంజుర్లి, గుళిగ వంటి దేవగణాలను రణవీర్ అసభ్యకరంగా ఇమిటేట్ చేశారని ఆరోపించారు. ఈ వివాదంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని రణవీర్ కోర్టును కోరారు. ఎవరినీ బాధ పెట్టాలని అలా చేయలేదంటూ బేషరతుగా సారీ చెప్పారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రాయశ్చిత్తంగా బాలీవుడ్ లెజెండ్‌ను 4 వారాల్లోగా చాముండేశ్వరి దేవిని దర్శించుకోవాలని ఆదేశించింది.

Also Read : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్

డాన్ 3 కాంట్రవర్సీతో బ్యాన్

'డాన్ 3' ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నందుకు రణవీర్ సింగ్‌పై FWICE బ్యాన్ విధించింది. షూటింగ్ స్టార్ట్ చేయడానికి కొన్ని రోజుల ముందు రణవీర్ ఇలా చెప్పడంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని చిత్ర నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. ఇందుకోసం తమకు రూ.45 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఆయనపై బ్యాన్ విధించేవరకూ వెళ్లింది. రణవీర్ సదరు సంస్థతో ప్రీ ప్రొడక్షన్స్, పరిహారం విషయం తేల్చుకునే వరకూ ఆయనతో కలిసి పని చెయ్యొద్దని పరిశ్రమను ఆదేశిస్తూ ప్రకటన జారీ అయ్యింది.

ఈ బ్యాన్ వల్ల ఆయనతో ఎవరూ కలిసి వర్క్ చేయకూడదు. నిషేధం ఉన్నన్ని రోజులూ ప్రొడక్షన్ హౌసెస్, స్టూడియోస్, టెక్నీషియన్స్ ఎవరూ కూడా రణవీర్‌తో సినిమాలు కానీ యాడ్స్ కానీ చేయకూడదు. ఇప్పటికే తనకు ఇచ్చిన రూ.10 కోట్ల అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేశారట. మరి ఈ వివాదాన్ని ఆయన ఎలా పరిష్కరించుకుంటారో చూడాల్సి ఉంది.

Also Read : వదలనే నిను వదలనే - మణిశర్మ లవ్ మ్యాజిక్... లవర్స్‌కు హార్ట్ టచింగ్ లిరిక్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.