Ranveer Singh's Dhurandhar 2 Breaks Baahubali 2 Record : 9 ఏళ్ల తెలుగు సినిమా రికార్డు... కేవలం 10 రోజుల్లోనే చెరిపేసింది 'ధురంధర్ 2'. ఇప్పటివరకూ టచ్ చేయలేమని భావించిన దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 రికార్డును బాలీవుడ్ మూవీ అధిగమించింది. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్ట్ అయ్యారు.
10 రోజుల్లోనే...
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2' వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఓవర్సీస్‌లో సత్తా చాటింది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కేవలం 10 రోజుల్లోనే నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా నిలిచింది.
9 ఏళ్లుగా బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును అధిగమించిందంటూ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బాహుబలి 2 నార్త్ అమెరికాలో $20.78M వసూళ్లు సాధించింది. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్ట్ అయ్యారు. 'ఇటీవలే ధురంధర్ 2 చూశా. ఆద్యంతం ఎంజాయ్ చేశా. ఈ మూవీ అన్నీ రికార్డులు బద్దలు కొడుతూ కొత్త బెంచ్ మార్క్ నెలకొల్పడం ఆనందంగా ఉంది. మూవీ టీంకు అభినందనలు.' అంటూ రాసుకొచ్చారు.
Also Read : బాలయ్యతో డింపుల్ - బ్లండర్ మిస్టేక్ అన్న నెటిజన్... మీకెవరు చెప్పారంటూ డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్
ఆ రికార్డు పదిలం
ఇప్పటివరకూ 'ధురంధర్ : ది రివెంజ్' వరల్డ్ వైడ్‌గా 10 రోజుల్లోనే రూ.1,226 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలో రూ.930.44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా... రూ.778.77 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పటివరకూ దాదాపు 18,820 షోస్ వేశారు. మొత్తానికి ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్‌కు సరికొత్త లెక్కలు నేర్పుతోంది.
రెండు సినిమాలు కలిపి బాహుబలి, కల్కి 2989AD, కేజీఎఫ్ కలెక్షన్స్‌ను దాటేశాయి. అయితే, ఓవర్సీస్‌లో తప్ప వరల్డ్ వైడ్‌గా బాహుబలి 2 (రూ.1810 కోట్లు), పుష్ప 2 (రూ.1,800 కోట్లు) రికార్డులు ఇంకా అలాగే ఉన్నాయి. త్వరలోనే ఈ రికార్డులు టచ్ చేస్తుందంటూ సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా దంగల్ (రూ.2,024 కోట్లు) రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన మూవీలో రణవీర్‌తో పాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రిలీజై 10 రోజులైనా అంతే జోష్, ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది.
