రాణి ముఖర్జీ  కాజోల్ ఇద్దరూ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలిగినవారే.  రాణి ముఖర్జీ ఈ మధ్య మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. రాణి ముఖర్జీ, కాజోల్ సినిమాలకు బాలీవుడ్ లో ఓ క్రేజ్ ఉంది. ఇద్దరూ కలసి నటించిన సినిమా అంటే  కుచ్ కుచ్ హోతా హై.  హీరోయిన్లుగానే కాదు..ఇద్దరి మధ్యా అక్కాచెల్లెళ్ల బంధం కూడా ఉంది.  స్టార్టింగ్ లో ఇద్దరి మధ్యా కొంత గ్యాప్ ఉండేది. ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థల కారణంగా ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత వివాదాలు ముగిసి కుటుంబాలు ఒక్కటవ్వడంతో...రాణి, కాజోల్ కూడా కలసిపోయారు. అప్పటి నుంచి  ఇద్దరూ బంధువులుగానే కాదు స్నేహితులుగానూ మారారు. ఇంతకీ ఈ అక్కా చెల్లెలు ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధనవంతులు, ఎవరి ఆస్తి విలువ ఎంత, ఎవరికి ఎన్ని కార్లున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

 రాణి ముఖర్జీ నికర విలువ

GQ నివేదిక ప్రకారం  బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ నికర ఆస్తుల విలువ 200 కోట్లు. రాణి ముఖర్జీ తన భర్త ఆదిత్య చోప్రాతో కలిసి చాలా ఆస్తులు కలిగి ఉన్నారు. ముంబైలో ఆమెకు ఒక భవనం ఉంది, దాని విలువ 30 కోట్లుగా చెబుతున్నారు. అలాగే, 7.12 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కూడా ఉంది. దీనితో పాటు నవీ ముంబైలో 8 కోట్ల విలువైన బంగ్లా ఉంది. ఆమెకు మరో బంగ్లా కూడా ఉంది, దాని విలువ కూడా 8 కోట్లుగా చెబుతున్నారు.  రాణి ముఖర్జీ సినిమాల కోసం 7 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. దీనితో పాటు, ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం 6 కోట్లు వసూలు చేస్తారు. రాణి ముఖర్జీకి  చాలా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

కాజోల్ ఎంత ధనవంతురాలు?

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కాజోల్ నికర విలువ రాణి ముఖర్జీ కన్నా కొంచెం ఎక్కువ. కాజోల్ 249 కోట్ల రూపాయలకు అధిపతి. ఆమె నటనతో పాటు బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా సంపాదన బాగానే ఉంటుంది . కాజోల్ - ఆమె భర్త అజయ్ దేవగన్ జుహులో శివ శక్తి అనే బంగ్లాను కూడా ఉంది.   ఈ ఇంట్లోనే కాజల్, అజయ్ దేవగన్ జంట పిల్లతో సంతోషంగా నివసిస్తున్నారు.  ఈ ఇంటి విలువ 60 కోట్లుగా చెబుతున్నారు. దీనితో పాటు, ఆమెకు జుహులో రెండు అపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి. లండన్‌లో కూడా ఓ ఇల్లు ఉంది. కాజోల్ కు  BMWX7 మరియు Audi Q7 వంటి కార్లు ఉన్నాయి.

ప్రస్తుతం కాజోల్ ది ట్రయల్ అనే వెబ్ సిరీస్‌లో కనిపిస్తున్నారు.