నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నో సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇక డిసెంబర్‌లో విడుదల కానున్న సినిమాలు కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నాయి. ఆ లిస్ట్‌లో అత్యధిక అంచనాలు ఉన్న సినిమాల్లో ‘యానిమల్’ ముందంజలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుండి మూడు పాటలు విడుదలయ్యి.. మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం హిందీలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా ‘యానిమల్’ పాటలు సూపర్ సక్సెస్‌ఫుల్ అయ్యాయి. ఇక ‘యానిమల్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం వచ్చేసిందని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ఈ వార్త రణబీర్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.


ఆరోజే ట్రైలర్ విడుదల..
రణబీర్ కపూర్, రష్మిక మందనా జంటగా నటిస్తున్న ‘యానిమల్’ మూవీ ట్రైలర్.. నవంబర్ 23న విడుదల కానుందని ట్విటర్‌లో అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన పాటలు.. మూవీపై అంచనాలు పెంచేశాయి. అంతే కాకుండా చాలాకాలం క్రితం విడుదలయిన ‘యానిమల్’ గ్లింప్స్ అయితే సందీప్ సత్తా ఏంటో ప్రేక్షకులకు గుర్తుచేసింది. తన సినిమా చుట్టూ ఎన్ని కాంట్రవర్సీలు అవుతున్నా పట్టించుకోని సందీప్.. ‘యానిమల్’తో మరోసారి ఎలాంటి కాంట్రవర్సీలను తెరపైకి తీసుకువస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


‘అర్జున్ రెడ్డి’ తర్వాత ‘యానిమల్’తో..
‘అర్జున్ రెడ్డి’లాంటి ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అప్పటివరకు టాలీవుడ్ పెట్టుకున్న రూల్స్‌ను బ్రేక్ చేసి.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు ఈ డైరెక్టర్. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరోలు సైతం తనతో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. కానీ సందీప్ మాత్రం తొందరపడకుండా.. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్నే హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి.. బాలీవుడ్‌లో కూడా తన సత్తా ఏంటో చాటుకున్నాడు. బీ టౌన్‌లో గుర్తింపు రావడంతో అక్కడే మరో సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు. అలా ‘యానిమల్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. డిసెంబర్ 1న ఈ మూవీ విడుదలకు సన్నాహాలు జరుగుతుండగా.. తాజాగా ట్రైలర్ డేట్‌ను అనౌన్స్ చేసింది టీమ్.






బుర్జ్ ఖలీఫాపై స్క్రీనింగ్..
‘యానిమల్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే దుబాయ్‌లోని అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై మూవీ గ్లింప్స్‌ను ఒక నిమిషాం పాటు ప్లే చేసింది మూవీ టీమ్. బుర్జ్ ఖలీఫాపై స్క్రీనింగ్‌తో ‘యానిమల్’ ప్రమోషన్స్ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో రణబీర్ కపూర్, రష్మికతో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ‘యానిమల్’ సినిమా కథ.. తండ్రి, కొడుకుల అనుబంధం చుట్టూ తిరుగుతుంది అని ఎప్పటినుండో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా.. అది నిజమే అనిపించేలా ‘పాపా మేరీ జాన్’ అంటూ తండ్రి సెంటిమెంట్‌పై సాగే ఒక పాటను మూవీ టీమ్ విడుదల చేసింది. దీంతో అసలు కథ ఏంటో తెలుసుకోవడానికి నవంబర్ 23వ తేదీన విడుదల కానున్న ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక కూడా తనకు బాలీవుడ్‌లో ఈ మూవీ పెద్ద బ్రేక్ ఇవ్వనుందని నమ్మకంతో ఉంది.


Also Read: 'గూఢచారి' సీక్వెల్ లో హీరోయిన్ గా బనితా సంధు - లండన్ బ్యూటీతో అడివి శేష్ రొమాన్స్!