Ram Charan: నాక్కూడా చిరంజీవి లాంటి ఫాదర్ ఉంటే... రామ్ చరణ్ డెబ్యూపై రామ్ పోతినేని కామెంట్స్
Ram Pothineni On Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీకి ముందు, 'దేవదాసు' విడుదల తర్వాత జరిగిన డిస్కషన్ గురించి రామ్ పోతినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నెపోటిజం అనేది బయటి నుంచి చూడటానికి ఒకలా ఉంటుంది. కానీ, ఇండస్ట్రీలో ఉండి ఆ వారసత్వాన్ని కొనసాగించడం మరోలా ఉంటుంది. ఓ స్టార్ హీరో కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే... అంచనాలు ఆకాశంలో ఉంటాయి. మోయలేనంత బరువు, బాధ్యత, ఒత్తిడి ఉంటుంది. అదే బయటి నుంచి ఓ కొత్త హీరో తెరపైకి వస్తే ఎలాంటి అంచనాలు ఉండవు. నెపో కిడ్స్ వచ్చీ రావడంతోనే నిరూపించుకోవాల్సి ఉంటుంది.. లేదంటే పరిస్థితులు తారుమారు అవుతాయి. ఇక ఇదే విషయంపై రామ్ పోతినేని మాట్లాడారు.
రామ్ చరణ్ గురించి చిరు టెన్షన్...
జగపతి బాబు షోలో రామ్ పోతినేని!
'జయమ్మ నిశ్చయమ్మురా' అంటూ జగపతి బాబు హోస్ట్ చేస్తున్న షోలో తాజాగా రామ్ పోతినేని సందడి చేశారు. తన 'దేవదాస్' రోజుల్ని రామ్ గుర్తు చేసుకున్నాడు. 'దేవదాస్' మెల్లిగా పబ్లిక్‌లోకి వెళ్లి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సినిమా అయితే హిట్ అయింది. కానీ, తాను హీరోగా ఇంకా ఇండస్ట్రీలో నిలబడలేదన్న సంగతి తనకు తెలుసని రామ్ అన్నాడు. అయితే ఆ రోజుల్లో 'దేవదాస్' మూవీని చిరంజీవి ప్రత్యేకంగా షో వేయించుకుని చూశారట. ఆ సంగతి రామ్ బయట పెట్టారు.
చిరంజీవి కుటుంబానికి ప్రత్యేకంగా షో వేస్తున్న సంగతి వైవీఎస్ చౌదరి ముందుగా రామ్ పోతినేనికి చెప్పారట. సరే చిరంజీవి లాంటి పెద్ద వాళ్లు సినిమా చూస్తున్నారు కదా? అని తాను కూడా షోకి వెళ్లాడట. అక్కడ రామ్ చరణ్ కూడా ఉన్నాడట. రామ్ చరణ్‌కి ఉన్నట్టుగా తనకి కూడా చిరంజీవి లాంటి ఫాదర్ ఉంటే బాగుండని... మరింత గ్రాండ్‌గా లాంచింగ్ దొరికేదని అనిపించదట. కానీ అలా ఉంటే.. మొదటి సినిమాకు ఎంతటి ఒత్తిడిని ఫేస్ చేయాల్సి వచ్చేదో అని రామ్ చెప్పుకొచ్చాడు.
Also Read: తేజా సజ్జా క్రేజ్ అట్లుంది మరి... అప్పుడే 'జాంబీ రెడ్డి 2' ఓటీటీ డీల్ క్లోజ్
''వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. నాలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తేనే చాలా సులభంగా లాంచ్ అవ్వగలను అని, రామ్ చరణ్ లాంటి వాళ్లు అయితే చాలా బరువు, బాధ్యత, ఒత్తిడిలతో లాంచ్ అవ్వాల్సి వస్తుందన్నట్టు''గా రామ్ పోతినేని కామెంట్ చేశారు. నెపో కిడ్‌గా వచ్చి స్టార్‌గా నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదని రామ్ పోతినేని కామెంట్లపై నెటిజన్లు ట్వీట్లు వేస్తున్నారు.
Also Read: అవును... వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి - అఫీషియల్‌గా చెప్పిన త్రివిక్రమ్ టీమ్!





















