Mahesh Babu : మహేశ్ బాబు, రాజమౌళి ఫైట్ - AI వీడియో షేర్ చేసిన RGV... సినిమా ఈజ్ డెడ్ అంటూ...
Rajamouli : సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి ఫైట్ చేసుకుంటున్న AI వీడియో వైరల్ అవుతోంది. దర్శకుడు ఆర్జీవీ దీన్ని షేర్ చేయగా నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

Mahesh Babu Rajamouli Fight AI Video Gone Viral : ప్రస్తుతం AI ట్రెండ్ సాగుతున్న సంగతి తెలిసిందే. ఏదైనా అసాధ్యాన్ని టెక్నాలజీతో సుసాధ్యం చెయ్యొచ్చు. సినీ ఇండస్ట్రీలో మూవీ ప్రమోషన్స్ కోసం ఇప్పుడిప్పుడే ఏఐను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని విధంగా కొన్ని ఏఐ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అలా వైరల్ అవుతున్న AI వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ఇంతకీ అందులో ఏముందంటే?
మహేశ్ బాబు, రాజమౌళి ఫైట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి గొడవ పడుతున్నట్లుగా కొందరు AI వీడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని షేర్ చేసిన ఆర్జీవీ... 'సినిమా ఈజ్ డెడ్' అంటూ రాసుకొచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు కొందరు AI వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటే... కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
'ఏఐతో ఏదైనా సాధ్యమే' అంటూ ఓ నెటిజన్ రియాక్ట్ కాగా... 'మహేశ్ పాస్ పోర్డ్ విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారు.' అంటూ ఓ నెటిజన్ రాయగా... 'వారణాసి ప్రమోషన్స్‌లో ఈ వీడియోను కచ్చితంగా ప్లే చేస్తారు.' అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. అసలు ఇలా ఎందుకు వీడియో క్రియేట్ చేయడం అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
CINEMA IS DEAD https://t.co/JUPhPHPTDz
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2026
Also Read : 'కల్కి 2' షూటింగ్ - 40 ఏళ్ల తర్వాత సెట్‌లో లెజెండ్స్... డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ?
మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో విజువల్ వండర్ 'వారణాసి' కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జార్జియాలో కీలక సీన్స్ షూట్ చేస్తుండగా మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ కాగా... రామాయణం షెడ్యూల్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ జూన్ నాటికి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత VFX పనులు ప్రారంభించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక, ఈ మూవీలో మొత్తం 6 పాటలు ఉండగా... ఇప్పటికే సంచారి, ప్రళయం ప్రళయం దుష్కృత వలయం సాంగ్స్ రిలీజ్ చేశారు. సినిమా బీజీఎం వర్క్స్ ఈ సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు ఆస్కార్ విన్నర్ కీరవాణి. టైటిల్ గ్లింప్స్‌లో అద్భుతమైన విజువల్స్‌కు బీజీఎం వేరే లెవల్‌లో ఉంది. ఇప్పటివరకూ ఆడియన్స్ ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని మ్యూజిక్ ఉండబోతోందని గతంలో హైప్ ఇచ్చారు కీరవాణి. ఈ మూవీలో నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. రుద్రుడిగా మహేశ్ బాబు, మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ రణ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్, శివ భక్తుడిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. కీలక పాత్రలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మిస్తున్నారు.
























