ఏఆర్ రెహమాన్ గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన అతన అద్భుత సంగీతంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా రెండు ఆస్కార్ అవార్డులను సైతం ఆయన అందుకున్నారు. అలాంటి దిగ్గజ సంగీత దర్శకుడిపై బాలీవుడ్ డైరెక్టర్ సుభాయ్ ఘాయ్ ఓ పాట విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అంతేకాదు, సుభాష్ మాటలకు రెహమాన్ ఇచ్చిన సమాధానం విని తాను షాక్ అయ్యానని ఆర్జీవీ వెల్లడించారు.


ఇంతకీ రెహమాన్, సుభాష్ మధ్య గొడవేంటి?


సుభాష్ ఘాయ్ ‘యువరాజ్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాకు రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అయితే, రెహమాన్ ఎప్పుడూ అనుకున్న సమయానికి మ్యూజిక్ అందించరనే విమర్శ ఉంది. ఇదే విషయంపై ఓసారి సుభాష్ ఘాయ్ రెహమాన్ తో గొడవ పడినట్లు ఆర్జీవీ వెల్లడించారు. తన సినిమాకు అనుకున్న సమయానికి ఎందుకు సంగీతం ఇవ్వలేదో చెప్పాలంటూ సుభాష్ రెహమాన్ కు ఘాటు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రెహమాన్ ‘యువరాజ్’ సినిమా కోసం సుఖ్విందర్ దగ్గర ట్యూన్ కంపోజ్ చేయాలని చెప్పారు. ఈ విషయం సుభాష్ కు తెలిసింది. వెంటనే ఆయన రెహమాన్ కు ఫోన్ చేసిన సీరియస్ అయ్యారు. మిమ్మల్ని పాటకు ట్యూన్ కంపోజ్ చేయాలని చెప్తే, మీరు సుఖ్విందర్ చేత ఎలా చేయిస్తారని కాసేపు ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్ పెట్టేశారు.


 ‘యువరాజ్’ సినిమా కోసం తాను సుఖ్విందర్ తో ట్యూన్ కంపోజ్ చేయిస్తున్న విషయం సుభాష్ కు తెలిసిందని రెహమాన్ కు అర్థం అయ్యింది. ఆ తర్వాత సుభాష్ ను తీసుకొని రెహమాన్ స్టూడియోకు వెళ్లారు. అక్కడ సుఖ్విందర్ ఓ పాటకు ట్యూన్ కంపోజ్ చేస్తూ కనిపిస్తాడు. ఆ సమయంలో రెహమాన్ సుఖ్వీందర్‌ను ఏదైనా ట్యూన్ చేశావా? అని అడుగుతారు.  సుఖ్వీందర్ చేశాను అని చెప్తాడు. ప్లే చేయమ్టారు. ఆ ట్యూన్ ను సుభాష్ కు వినిపిస్తారు. నచ్చిందా? అని అడుగుతారు. సుభాష్ కు ఎక్కడలేని కోపం వస్తుంది. మిమ్మల్ని ట్యూన్ కంపోజ్ చేయాలని చెప్తే, సుఖ్విందర్ తో ఎలా చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు.


మీరు డబ్బులు ఇచ్చేది నా సంగీతానికి కాదు, నా పేరుకు- రెహమాన్


అప్పుడు రెహమాన్ ఇచ్చిన సమాధానం తన జీవితంలో మర్చిపోలేనని చెప్పారు అర్జీవీ. “సార్, మీరు నాకు డబ్బులు చెల్లించేది మీ సినిమాలో నా పేరును ఉపయోగించుకునేందుకు మాత్రమే. నా సంగీతానికి కాదు. నేను ఆ ట్యూన్ ను ఓకే చేస్తే ఆ ట్యూన్ నాదే అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ట్యూన్ నేను చేయలేదని అర్థం అయ్యింది. మీరు ఇప్పుడు ఇక్కడ లేకపోతే ఎలా తెలుస్తుంది? నేను తాల్ సంగీతాన్ని ఎక్కడ నుంచి తీసుకున్నాను అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? ఆ పాటకు ట్యూన్ నేనే కాదు, నా డ్రైవర్ కూడా చేస్తారు” అని చెప్పడంతో సుభాష్ షాక్ అయ్యారని ఆర్జీవీ వివరించారు. 


Read Also: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం