Ram Gopal Varma Apologise To Megastar Chiranjeevi : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ... మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. తన ఫస్ట్ మూవీ 'శివ' రీ రిలీజ్ సందర్భంగా చిరు వీడియోకు ఆయన రియాక్ట్ అయ్యారు. 'శివ' సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అంటూ చిరు ప్రశంసిస్తూ ఆర్జీవీకి శుభాకాంక్షలు తెలపగా... గతంలో ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.
చిరంజీవి గారు... సారీ
'శివ' ఎంతటి ట్రెండ్ సెట్ చేసిందో వివరిస్తూ చిరు వీడియో చేశారు. 36 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ సందర్భంగా టీంకు విషెష్ తెలిపారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ... చిరంజీవికి సారీ చెప్పారు. 'థాంక్స్ చిరంజీవి గారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా. విశాల హృదయంతో మా టీంను విష్ చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read : ముంబయిలో కూల్... వైజాగ్‌లో ట్రెడిషనల్ - ఆమె నుంచి తెలుగు నేర్చుకోవాలి... శోభితపై చై ప్రశంసలు
'శివ'పై చిరంజీవి ప్రశంసలు
కింగ్ నాగార్జున కెరీర్‌లోనే 'శివ' ఎంత స్పెషల్ అందరికీ తెలిసిందే. ఈ మూవీతోనే ఆర్జీవీ డైరెక్టర్‌గా మారారు. అప్పట్లో 'శివ' సైకిల్ చైన్ నిజంగా ఓ ట్రెండ్ సెట్టరే. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఈ మూవీ ఈ నెల 14న రీ రిలీజ్ కాబోతోంది. దీంతో టాలీవుడ్ టాప్ హీరోస్ విషెష్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు. ''శివ' సినిమా చూసి నేను ఆశ్చర్యపోయా. ఇది మూవీ కాదు ఓ ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పింది. మూవీలో హీరో సైకిల్ చైన్ లాగే సీన్ ఎప్పటికీ మర్చిపోలేం.
నాగార్జున నటన అద్భుతం... అమల, రఘువరన్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండడం మంచి ప్రయత్నం. ఆర్జీవీ విజన్ ఫెంటాస్టిక్. ఈ యువ డైరెక్టర్ తెలుగు సినిమా భవిష్యత్తు నాకు అప్పుడే కనిపించింది. హ్యాట్సాఫ్ టు రామ్ గోపాల్ వర్మ. మూవీ టీంకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.' అంటూ చెప్పారు చిరు.
అసలు రీజన్ అదేనా?
చిరు వీడియోకు ఆర్జీవీ థాంక్స్ చెబుతూనే సారీ చెప్పారు. అయితే, అసలు రీజన్ ఏంటో చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గతంలో చిరు - ఆర్జీవీ కాంబోలో 'వినాలని ఉంది' అనే సినిమా తెరకెక్కించాలనుకున్నారు. 20 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టును వర్మ మధ్యలోనే వదిలేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వచ్చాయి. పలు సందర్భాల్లో చిరుపై సెటైర్లు వేశారు వర్మ. ఇప్పుడు సారీ చెప్పడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.