Ram Charan Speech Highlights In Peddi Chennai Event : పెద్ది తన సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు రామ్ చరణ్. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్‌పై ప్రశంసలు కురిపించారు.
సీఎం విజయ్‌పై ప్రశంసలు
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు విజయ్ స్టార్ డమ్ వదిలి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని ప్రశంసించారు చరణ్. 'సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా విజయ్‌ను చూసి గర్వపడుతున్నా. విజయ్‌తో పాటు తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు.' అని అన్నారు. తమిళ ఆడియన్స్ అంటే తనకు చాలా ఇష్టమని... వారిని పెద్దితో మెప్పించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. డిసిప్లిన్ కల్చర్ తనకు నచ్చుతుందని... థియేటర్లలోనూ క్లీన్ రివ్యూస్ ఇస్తారని అన్నారు.
అమ్మకు చెప్తుండేవాడిని
పెద్ది కోసం తాను రెండేళ్లు శ్రమిస్తే డైరెక్టర్ బుచ్చిబాబు ఆరేళ్లు హార్డ్ వర్క్ చేశాడని చెప్పారు చరణ్. 'పెద్ది ఇష్టంతో చేసిన సినిమా. ప్రతీరోజూ ఇంటికి వెళ్తూ షూటింగ్ గురించి విశేషాలు అమ్మకు చెప్పేవాడిని. RRR, రంగస్థలం, మగధీర మూవీస్ తర్వాత అలాంటి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాంటి రోల్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు. చాలామంది గొప్ప నటులతో కలిసి వర్క్ చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నా.
సినిమాలో కన్నడ స్టార్ శివన్నది వెరీ స్పెషల్ రోల్. జైలర్‌లో ఆయనది ఐకానిక్ పెర్ఫార్మెన్స్. ఈ సినిమాలో ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే ఫైరే. రోల్ అంత పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అద్భుతం.' అని అన్నారు.
Also Read : Karuppu OTT : సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?'
'పెద్ది నుంచి తప్పుకోవాలనుకున్నా'
పెద్ది మూవీ నుంచి తాను తప్పుకోవాలనుకున్నట్లు చెప్పారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. 'డైరెక్టర్ బుచ్చిబాబు నాకు కథ చెప్పగానే చాలా నచ్చింది. ఆ తర్వాత చరణ్ గారితో మాట్లాడా. కానీ నాకు క్యాన్సర్ డిటెక్ట్ కావడంతో అమెరికా వెళ్లి మళ్లీ వచ్చా. అయినా వారు నా కోసం వెయిట చేశారు. నేను ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోదామనుకున్నా. డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రం ఆ రోల్ నేనే చేయాలని పట్టుబట్టారు. చాలా రోజులు నాకోసం వెయిట్ చేశారు. పెద్ది ఓ వండర్ ఫుల్ జర్నీ. ఓ వ్యక్తి ఇన్‌స్పిరేషనల్ స్టోరీ.' అని చెప్పారు.
'ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశా'
ఉప్పెనకు నేషనల్ అవార్డు వచ్చాక సెకండ్ మూవీ పెద్ది ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసినట్లు చెప్పారు డైరెక్టర్ బుచ్చిబాబు. '15 రోజుల నుంచి చెన్నైలోనే ఉన్నా. ప్రతీ రోజూ మూవీ చూస్తున్నా. హైదరాబాద్‌లోనూ షోస్ జరుగుతున్నాయ్. చాలా మంచి మూవీ తీశావంటూ వారంతా కాల్స్ చేస్తున్నారు.
రెహమాన్ సర్ మ్యూజిక్ అద్భుతం. నేను ఆయన గురించి ఓ పుస్తకం రాస్తాను. నాకు మ్యూజిక్ కూడా రాదని ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేసేవారు. కానీ ఇప్పుడు ఆయనతో మూవీ చేసే అవకాశం వచ్చింది.' అని అన్నారు. పెద్ది జూన్ 4న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
