Ram Charan's Peddi Release Date Lock : మెగా మాస్ జాతర డేట్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ట్రైలర్ డేట్ ఫిక్స్ అయ్యింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ట్రైలర్‌ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది.

Continues below advertisement

ట్రైలర్ ఎప్పుడంటే?

పెద్ది ట్రైలర్‌ను ఈ నెల 18న (సోమవారం) రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'పెద్ది మీ హృదయాల్లో నిలిచిపోతాడు. మే 18న ట్రైలర్ వస్తోంది.' అంటూ రాసుకొచ్చారు. ఆ రోజున ఆర్థిక రాజధాని ముంబైలో భారీ ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ట్రైలర్ రాకతో స్టోరీపై మరింత క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఈసారి చరణ్ మాస్ జాతరతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు.

Continues below advertisement

Also Read : ఓటీటీలో ఈ వారం వెరీ స్పెషల్ - ధురంధర్ 2 To టీవీతో పాటు EXAM... మూవీస్, వెబ్ సిరీస్ ఫుల్ లిస్ట్

నేషనల్ లెవల్‌లో...

ఇప్పటికే టీం నేషనల్ లెవల్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుండగా... ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లోనే ఉంటుందా? లేదా? అనేది క్లారిటీ లేదు. మరోవైపు, ఝార్ఖండ్ రాంచీలో ఓ ప్రమోషనల్ ఈవెంట్‌ ప్లాన్ చేస్తుండగా... క్రికెట్ లెజెండ్ ధోనీ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూవీ టీం ఈ మేరకు సంప్రదింపులు జరుపుతోందట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఒకవేళ ధోనీ ఈవెంట్‌కు వస్తే... నేషనల్ వైడ్ పెద్ది క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుందని భావిస్తున్నారు.

ఈ మూవీ రన్ టైం 3 గంటలకు పైగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ హిట్ మూవీస్ పుష్ప 2, RRR, కల్కి అంతే స్థాయిలో రన్ టైం ఉండగా... పెద్ది కూడా బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో కలెక్షన్స్ జోరు కంటిన్యూ అవుతోంది. టికెట్స్ ప్రీ సేల్స్ అదిరిపోయాయి. ఇప్పటివరకూ ఉన్న పవన్ కల్యాణ్ మూవీ రికార్డును పెద్ది చెరిపేసింది. త్వరలోనే మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.

Also Read : ప్రేమపై త్రిష పోస్ట్ - స్పెషల్ ఏంటో తెలుసా?

ఈ మూవీలో చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. జూన్ 3న ప్రీమియర్స్ వేయనుండగా... జూన్ 4న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది పెద్ది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మించారు.

Note :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.