Ram Charan's Peddi Powerplay Tour Events Complete List : దేశవ్యాప్తంగా పెద్ది మేనియా ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ట్రైలర్ ఈ నెల 18న రిలీజ్ కానుంది. అంతే కాకుండా మూవీ టీం బిగ్ సర్‌ప్రైజెస్ ప్లాన్ చేసింది. ఒక్కో రోల్ మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ అందిస్తోంది. ఇప్పటివరకూ ప్రమోషన్స్ ఇంకా ప్లాన్ చేయలేదంటూ వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టింది. భారీ ప్రమోషన్స్‌తో దేశవ్యాప్తంగా ఉన్న హైప్‌ను పదింతలు చేయబోతోంది.

Continues below advertisement

పవర్ ప్లే టూర్...

గతంలో ఎన్నడూ చూడని విధంగా 'పెద్ది' ప్రమోషన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, వీడియోస్‌తో మూవీపై అంచనాలు వేరే లెవల్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పెద్ది పవర్ ప్లే టూర్ ప్రారంభించనున్నారు. ఈ నెల 18న ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌తో టూర్ ప్రారంభం కానుంది. అన్ని ప్రధాన భాషల్లో థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ కానుంది. అక్కడి నుంచి ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్‌ మరింత జోరందుకోనుంది.

Continues below advertisement

మే 22న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న SRH vs RCB మ్యాచ్ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా హాజరు కానుండటం స్పెషల్ అట్రాక్షన్‌గా మారనుంది. మే 23న భోపాల్‌లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇందులోనే చరణ్, శ్రుతి హాసన్‌ల స్పెషల్ సాంగ్ రిలీజ్ కానుంది. 

చరణ్ విత్ బుచ్చిబాబు

ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్‌తో కలిసి సందడి చేశారు. కారులో వీరిద్దరూ ప్రయాణిస్తూ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ట్రైలర్ 18న వచ్చేస్తుందని... జూన్ 4న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. 

Also Read : శుక్రవారం ఓటీటీలో కొత్త మూవీస్ సందడి - ధురంధర్ 2 నుంచి కర్తవ్య... ఒకే రోజు 16 సినిమాలు

మే 24న బెంగళూరు, మే 28న ఢిల్లీ, మే 30న చెన్నై, జూన్ 1న విజయనగరం, జూన్ 2న హైదరాబాద్‌లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అంతే కాదు, సమ్మర్ అంతా హైప్ కొనసాగించేలా మరిన్ని సర్‌ప్రైజ్‌లు కూడా సిద్ధం చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. 'ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో సర్‌ప్రైజెస్ సిద్ధంగా ఉన్నాయి. మీకు అల్టిమేట్ సమ్మర్ ట్రీట్ అందించడానికి మేము ఎంతో కష్టపడ్డాం. మీ హాలిడేస్‌ను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేందుకు జూన్ 4న ముందుగానే వస్తున్నాం. మా టీమ్ ప్రతి ఫ్రేమ్‌లో మనసు పెట్టి పని చేసింది. బిగ్ స్క్రీన్‌పై మీరు ఈ ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదించేందుకు మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం.' అని మేకర్స్ తెలిపారు.

ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించగా... చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.

Also Read : న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.