Ram Charan Peddi Movie Release Date Controversy : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతోన్న అవెయిటెడ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై గందరగోళం నెలకొంది.

Continues below advertisement

సోషల్ మీడియాలో చర్చ

డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన టైంకే మూవీని రిలీజ్ చేసేలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, అది సాధ్యమేనా అనే అనుమానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండడం, ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ అనుకున్న టైంకు పూర్తవుతాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు, సినిమా టికెట్స్ ధరల పెంపు అంశంపై తెలంగాణ హైకోర్టు విధించిన 90 రోజుల నిబంధన వల్ల కూడా మూవీ రిలీజ్ వాయిదా పడొచ్చనే ప్రచారం సాగుతోంది.

Continues below advertisement

ఈ క్రమంలో మరో తేదీపై నిర్మాతలు ఆలోచిస్తున్నారనే వార్తలు ఫిలింనగర్ సర్కిల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అనుకోని కారణాలతో మూవీ వాయిదా పడితే మే 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే మూవీ టీం, నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

'పెద్ది' ఫస్టాఫ్ రీ రికార్డింగ్

తాజాగా 'పెద్ది' ఫస్టాఫ్‌ను లాక్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు ఈ వెర్షన్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వద్దకు పంపారట. ఆయన రీ రికార్డింగ్ పనులు కూడా మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ యూరప్‌లో జరగనుండగా కీలక సీన్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే రిలీజ్ అయిన 'చికిరి చికిరి' సాంగ్ ట్రెండ్ అవుతుండగా... త్వరలోనే రెండో సాంగ్ కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read : ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ కెరీర్‌లోనే టాప్ - షూటింగ్ స్టార్ట్స్ సూన్... ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్

పవన్ 'ఉస్తాద్' వస్తుందా?

మొన్నటి వరకూ నెట్టింట రామ్ చరణ్ 'పెద్ది' వర్సెస్ నాని 'ది ప్యారడైజ్' గా సాగింది. మార్చి 27న 'పెద్ది' రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినా నాని మూవీ కూడా మార్చి 26న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. నాని మూవీ వాయిదా వేస్తే బాగుంటుందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఈ కాంట్రవర్శీకి 'ప్యారడైజ్' నిర్మాత సుధాకర్ చెరుకూరి రీసెంట్‌గా చెక్ పెట్టారు. 'పెద్ది' మూవీతో కలిసి రాబోమని తేల్చిచెప్పారు. సమ్మర్‌లో చాలా గ్యాప్ ఉంటుందని అవసరం అనుకుంటే అప్పుడే మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తామని చెప్పారు.

ఒకవేళ 'పెద్ది' వాయిదా పడితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. 'ఓజీ' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత హరీష్ శంకర్ కాంబో సినిమా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి, ప్యారడైజ్ కూడా అప్పుడే రిలీజ్ చేస్తారా? లేదా పోస్ట్ పోన్ చేస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది.