Ram Charan's Peddi Movie Glimpse Release Date Announced: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన 'ఫేం' బుచ్చిబాబు కాంబో లేటెస్ట్ మూవీ 'పెద్ది' (Peddi). ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేయగా ఆకట్టుకుంటోంది. ఇక గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై మూవీ టీం తాజా అప్ డేట్ ఇచ్చింది.

శ్రీరామనవమి సందర్భంగా..

శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న పెద్ది ఫస్ట్ గ్లింప్స్ (Peddi Glimpse) రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో క్రికెట్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.

Also Read: ధర్మం కోసం పోరాడే యోధుడు వచ్చేస్తున్నాడు - 'హరిహర వీరమల్లు' నుంచి పవన్ కల్యాణ్ కొత్త లుక్

ఫస్ట్ లుక్ అదుర్స్

ఈ మూవీలో రామ్ చరణ్ డిఫరెంట్ రోల్ చేయబోతున్నట్లుగా ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ బట్టి తెలుస్తోంది. బీడీ కాలుస్తూ.. ముక్కుకు రింగుతో గెడ్డంతో ఆయన మాస్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా.. మరో పోస్టర్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో ఓ మ్యాచ్ జరుగుతున్నట్లుగా ఉంది. సినిమాలో ఆయన పేరు కూడా పెద్ది అనే ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు.. ఈ లుక్ అచ్చం పుష్పలో అల్లు అర్జున్‌లానే ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయగా.. దానికి చరణ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు.

ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటికే 2 పాటలు కూడా పూర్తి చేసినట్లు ఇటీవలే ఆయన తెలిపారు.

1000 సార్లు చూస్తారు

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో 'పెద్ది' మూవీ తెరకెక్కుతోంది. 'పెద్ది' మూవీ గ్లింప్స్ ఇటీవలే చూశానని.. అదిరిపోయిందంటూ నిర్మాత రవిశంకర్ తెలిపారు. స్పెషల్‌గా రూపొందించిన ఓ సీన్ కోసమే గ్లింప్స్ రిలీజైన తర్వాత ఆడియన్స్ కనీసం 1000 సార్లు చూస్తారనని అనడంతో భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. తాము నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో రామ్ చరణ్ - బుచ్చిబాబు మూవీ వేరే లెవల్ అని పేర్కొన్నారు. నిజానికి ఫస్ట్ లుక్‌తో పాటే గ్లింప్స్ సైతం రిలీజ్ చేస్తారని అంతా భావించగా.. అది సాధ్యం కాలేదు.