Ram Charan First Reaction After Twins Birth : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. తాజాగా చరణ్ దీనిపై డబుల్ ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. 'మాకు ఒక బాబు, పాప పుట్టారని చెప్పడానికి సంతోషంగా ఉంది.
ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కలిగి ఉండడం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం. మా జీవితంలో మహిళలే మాకు గొప్ప బలం. ప్రతీ క్షణం మాకు అండగా నిలిచిన కుటుంబ, సపోర్ట్ చేసిన మా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ థాంక్స్' అంటూ రాసుకొచ్చారు. తన భార్య ఉపాసనతో దిగిన స్పెషల్ ఫోటోను షేర్ చేశారు.
Also Read : రేపే విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి? - రాజస్థాన్ ప్యాలెస్ వీడియో వైరల్... ఆ వార్తల్లో నిజమెంత?
శనివారం రాత్రి మెగా కోడలు ఉపాసన పండంటి కవలలకు జన్మించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఆదివారం ఉదయం ప్రెస్ మీట్‌లో ఆనందం వ్యక్తం చేస్తూ... తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని... ముందు బాబు, తర్వాత పాప పుట్టారని తెలిపారు. తమ మంచి కాంక్షించే మెగా అభిమానులకు థాంక్స్ చెప్పారు. అటు ఆస్పత్రి వద్దకు మెగా ఫ్యాన్స్ భారీగా చేరుకుని వారుసుడు వచ్చాడంటూ నినాదాలు చేశారు.
అభిమానుల అత్యుత్సాహం
ఈ సందర్భంగా రామ్ చరణ్ అపోలో ఆస్పత్రి వద్దకు తన రెండేళ్ల చిన్నారి క్లీంకారతో చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ప్రైవేట్ సెక్యూరిటీతో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినా అభిమానుల అత్యుత్సాహంతో చరణ్ కాస్త ఇబ్బంది పడ్డారు. క్లీంకారను ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. ఓ దశలో ఆయన ఫ్యాన్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు సెక్యూరిటీ అతి కష్టం మీద ఆయన్ను ఆస్పత్రి లోపలికి పంపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
మెగా కోడలు ట్వీట్
రామ్ చరణ్ దంపతులకు మెగా కోడలు లావణ్య త్రిపాఠి విషెష్ తెలిపారు. ట్విన్స్‌కు జన్మనిచ్చిన ఉపాసనకు కంగ్రాట్స్ చెప్పారు. 'హాయ్ చిట్టి కవలలు. ఈ ప్రపంచానికి మీకు స్వాగతం. అందరూ మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. క్లీంకార ఇప్పుడు అక్కగా ప్రమోషన్ పొందింది. మీ చిన్న కజిన్ వాయువ్‌తో కలిసి పెరిగేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.
