Ram Charan Speech In Peddi Pre Release Event : పెద్ది తన సినీ జర్నీలో టాప్ మూవీగా నిలుస్తుందని... పర్సనల్‌గానూ తనను ఎంతో మార్చిందని చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. చరణ్, జాన్వీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు మూవీ టీం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Continues below advertisement

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు?

మెగా ఫ్యామిలీకి విజయవాడ ఎంతో లక్కీ అని... నాన్న చిరంజీవి ఇంద్ర, ఖైదీ, ఖైదీ నెం.150 సహా ఎన్నో విజయోత్సవాలు ఇక్కడే జరిగాయని చెప్పారు రామ్ చరణ్. ''పెద్ది' కథ విన్నప్పుడు మాత్రం నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. నాన్న చెప్పినట్టు ఇలాంటి కథలు పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. నా మూవీ జర్నీలో టాప్ సినిమాగా నిలుస్తుంది. నన్ను వ్యక్తిగతంగా కూడా ఎంతో మార్చింది.

Continues below advertisement

బుచ్చిబాబు దీన్ని కేవలం సినిమా కథలా కాకుండా, ఒక మనిషి జీవిత ప్రయాణంలా చెప్పారు. ఇది ఎగిసిపడే వ్యక్తి కథ కాదు... పడిపోయి మళ్లీ లేచి నిలబడే వ్యక్తి కథ. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డానని అందరూ అంటున్నారు. కానీ ఇలాంటి సినిమా కోసం కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు, ఇష్టంతో చేసిన పని.' అని అన్నారు.

Also Read : Janhvi Kapoor : ట్రెడిషనల్ లుక్‌లో అందాల జాన్వీ - అచ్చియమ్మ తెలుగు స్పీచ్‌... గోల్ రివీల్ చేసిన బ్యూటీ

'రక్తం చిందిస్తా'

ఆడియన్స్ కోసం చేయి విరగ్గొట్టుకోవడమే కాదని... రక్తం చిందించి కూడా పని చేస్తానని అన్నారు చరణ్. 'ప్రతిరోజూ ఉదయం లేచి జిమ్ చేసి, షూటింగ్‌కు వెళ్లాలని అనిపించిన అరుదైన సినిమాల్లో ఇది ఒకటి. ఫ్యూచర్‌లో ఇండియన్ టాప్ డైరెక్టర్స్‌లో బుచ్చిబాబు పేరు ఉంటుంది. ఆడియన్స్ కోసం రక్తం చిందించి మరీ వర్క్ చేస్తా. చిరంజీవి గారి కొడుకుగా, పవన్ కళ్యాణ్ బాబాయ్‌గా ఉన్నందుకు... నాకు తెలిసింది సినిమా మాత్రమే. నేను ఉన్నంత కాలం మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా.

ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్. దాదాపు 280 రోజుల కష్టం పెట్టిన ఈ సినిమాకు ఆయన మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. ఆయన అంకితభావం అసాధారణం. జాన్వీ కపూర్ శ్రీదేవి గారి కంటే కూడా పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడి ఓటమి మాత్రమే కాదు, ఒక దేశం ఓడిపోయినట్టే. 'పెద్ది' ఆడలేదు... పోరాడాడు.' అని అన్నారు.

Also Read : Raaka Update : అల్లు అర్జున్ రాకాలో మలయాళ బ్యూటీ - అసలెవరీ ఫెమినా జార్జ్... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.