Rakul Preet Singh Reveals About Her Charecter In Indian - 2: 1996లో అగ్రకథానాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా 'భారతీయుడు'. శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ రోజుల్లో 'భారతీయుడు' సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ 'భారతీయుడు - 2' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జులై 12న ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే, ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్నారు. ఆమె క్యారెక్టర్ చాలా ప్రత్యేకం అంట. ముంబైలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
ఇది నాకు చాలా ప్రత్యేకం..
'భారతీయుడు - 2'లో ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పారు రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటి వరకు చేసిన అన్ని క్యారెక్టర్ లలో ఇది చాలా ప్రత్యేకంగా, డిఫరెంట్ గా ఉంటుందని చెప్పారు రకుల్. "ఈ సినిమా కచ్చితంగా నా కెరీర్ లో చేసిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ఇందులో చేసిన పాత్ర మిగతా వాటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఒక ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయి. అనుకున్న దాన్ని ఎలా సాధించాలో తెలిసిన అమ్మాయిని. శంకర్ సార్ తో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాత్ర నా నిజజీవితానికి చాలా దగ్గరగా ఉందనే భావనని కలిగించింది. ఈ సినిమా గురించి చాలా చాలా చెప్పాలనే ఆసక్తితో ఉన్నాను. కానీ, చెప్పకూడదు" అంటూ తన క్యారెక్టర్ గురించి చెప్పారు రకుల్ ప్రీత్.
ఇదిలా ఉంటే వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్. ‘దే దే ప్యార్ దే2’ లో నటిస్తున్నారు రకుల్. దాని తర్వాత ‘మేరి హస్బెండ్ కీ బీవీ’ లో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ తో కలిసి నటిస్తున్నారు. నీనీ గుప్తా, చుంకీ పాండే నటిస్తున్న ‘అమీరీ’ లో కూడా ఉన్నారు రుకుల్.
ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక వరుసగా లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా కమల్ హాసన్ పై ఒక పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన టీమ్.. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, సిదార్థకి సంబంధించి ఒక కపుల్ మెలోడీ రిలీజ్ చేశారు. ఆ రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
భారతీయుడికి సీక్వెల్..
1996లో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రిలీజైన భారతీయుడు సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 50 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు చేసిన ఇండియన్ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాసింది. స్వాతంత్య్ర పోరాటం, దేశంలోని అవినీతి తదితర విషయాలపై సినిమా తెరకెక్కించారు. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు - 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ చందమామా కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: 'మీర్జాపూర్ - 3' రిలీజ్ డేట్ వచ్చేసింది - ఈ ఫొటోలోనే తేదీ ఉందట, చెప్పుకోండి చూద్దాం