Rakul Preet-Jackky Bhagnani Marriage Destination: బాలీవుడ్‌ హీరో, ప్రొడ్యూసర్‌ జాకీ భగ్నానీ, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నారు. ఈ ప్రేమ పక్షులు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. ఫిబ్రవరిలో ఈ ఇద్దరు ఒకటి కాబోతున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. రెండు రోజుల పాటు వీళ్ల పెళ్లి జరగనుంది. ఫిబ్రవరి 21న రకుల్‌, జాకీ ఇద్దరు ఒకటి కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. అయితే, ముందు వీళ్ల పెళ్లి విదేశాల్లో చేసుకోవాలని నిర్ణయించారట. కానీ, ఇప్పుడు వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ మారిపోయింది. 


కారణం అదే.. 


జాకీ భగ్నానీ, రకుల్‌ ఇద్దరూ తమ పెళ్లిని చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేసుకున్నారట. మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ని నిర్ణయించుకున్నారు ఈ ఇద్దరు. దానికి సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించేశారు కూడా. అన్నింటికి సంబంధించి ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. గెస్ట్‌ల అకామిడేషన్‌ అన్నీ డిసెంబర్‌ నుంచే ఫాలోఅప్‌ కూడా చేశారట. కానీ, ఈ మధ్య ప్రధాని మోడీ చెప్పిన మాటలు వాళ్లను ప్రభావితం చేశాయని సన్నిహితులు చెప్పారు. మన ఇండియాలోనే చాలా స్పాట్స్‌ ఉన్నాయని, పెళ్లిలు కూడా ఇక్కడే చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో వాళ్లు తమ వివాహాన్ని మన దేశంలోనే చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారని చెప్పారు. "నిజానికి అన్ని అడ్వాన్స్‌లు ఇచ్చారు. ప్లాన్‌ చేశారు. ఆర్డర్స్‌ ఇచ్చేశారు. కానీ, దేశం మీద ఉన్న ప్రేమతో.. వాళ్లు డెస్టినేషన్‌ మార్చుకున్నారు" అని రకుల్‌, జాకీకి దగ్గర వ్యక్తి ఒకరు చెప్పారు. దీంతో ఇప్పుడిక వీళ్ల పెళ్లి గోవాలో జరగే ఛాన్స్‌ ఉందనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. మాల్డీవ్స్‌తో గొడవల నేపథ్యంలో ప్రధాని మోడీ లక్షద్వీప్‌కి వెళ్లి అక్కడ ఫొటో షూట్‌ చేసిన విషయం తెలిసిందే. మన దేశంలోనే ఎన్నో గొప్ప గొప్ప టూరిస్ట్‌ స్పాట్స్‌ ఉన్నాయని ఆయన ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే. 


ఇక వచ్చే నెల 22న గోవాలో చాలా అంటే చాలా గ్రాండ్‌గా రకుల్‌ జంట తమ పెళ్లిని ప్లాన్‌ చేసుకుంటున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య వీళ్ల వివాహం జరగనుంది. ఈ పెళ్లిలో పసందైన పాటలతో ఆహ్లాదకరంగా గడపాలని ప్లాన్‌ చేస్తున్నారంట ఈ జంట. ఇక పెద్ద పెద్ద సెలబ్రిటీ జంటల పెళ్లిలకు వీడియోగ్రాఫర్‌గా వ్యవహరించిన విశాల్‌ పంజాబి ని వీళ్ల పెళ్లికి కూడా నియమిస్తున్నారట ఈ జంట. ఇక వాళ్ల డేటింగ్‌ నుంచి ఇప్పుడు పెళ్లివరకు జరిగిన మూమెంట్స్‌ అన్నీ కలిసేలా ఒక స్పెషల్‌ సాంగ్‌ కూడా డిజైన్‌ చేయించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట రకుల్‌ జంట. 


ప్రస్తుతం రకుల్‌ తన షూటింగ్స్‌లో బీజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 'ఇండియన్‌ - 2', 'అయాలన్‌' తదితర సినిమా షూటింగ్స్‌లో ఆమె బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు 'జాక్కీ', అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ఫ్రాఫ్‌తో కలిసి 'బడే మియాన్‌ చోటే మియాన్‌' సినిమాలు కూడా రకుల్‌కి రెడీగా ఉన్నాయి.


Also Read: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగోడి సత్తా - గ్లోబల్ రేటింగ్స్‌లోనూ దూసుకెళ్తోన్న ‘సలార్’, ‘యానిమల్’