అన్వేషించండి

Dada First Look: హ్యాపీ బర్త్ డే గంగూలీ... 'దాదా' ఫస్ట్ లుక్ రిలీజ్

Rajkummar Rao Dada First Look: సౌర‌వ్ గంగూలీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రాజ్ కుమార్ రావు హీరోగా రూపొందుతున్న 'దాదా - ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ' ఫ‌స్ట్ లుక్ విడుదల చేశారు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సౌరవ్ గంగూలీ పుట్టినరోజున 'దాదా' బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదలైంది.
  • రాజ్‌కుమార్ రావు గంగూలీగా షర్ట్‌లెస్ ఐకానిక్ మూమెంట్‌ను రీక్రియేట్ చేశారు.
  • ఈ చిత్రం 2027 మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు.

జూలై 8న లెజెండరీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుట్టిన రోజు (Sourav Ganguly Birthday). ఈ సందర్భంగా ఆయన బయోపిక్ 'దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ' (Dada The Sourav Ganguly Story) ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ లుక్ చూస్తే...

చొక్కా తీసిన గంగూలీ... రీక్రియెట్ చేసిన రాజ్!
'దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ'లో బాలీవుడ్ విలక్షణ నటుడు, కథానాయకుడు రాజ్‌ కుమార్ రావ్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ చూస్తే... లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో గంగూలీ ఐకానిక్ షర్ట్ లెస్ మూమెంట్ గుర్తుకు వస్తుంది. 'He Didn't Just Play The Game, He Changed It' - అనేది సినిమా క్యాప్షన్. గంగూలీ కేవలం క్రికెట్ మాత్రమే ఆడలేదని, ఆయన భారతీయ క్రికెటర్ల ఆట తీరును మార్చాడనే అర్థం అందులో ఉంది. ప్రజెంట్ ఈ లుక్ వైరల్ అవుతోంది.

Also ReadKing 100 - 'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?

క్రికెట్ అభిమానులు, భారతీయులు అందరికీ 2002లో ఇంగ్లాండ్‌ మీద మన భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌ వెస్ట్ ట్రోఫీ విజయం తప్పకుండా గుర్తుకు ఉంటుంది. ఆ విజయం తర్వాత లార్డ్స్ స్టేడియం బాల్కనీలో జెర్సీ విప్పేసి గంగూలీ చేసిన విజయ నాదం (ఐకానిక్ మూమెంట్‌) కూడా గుర్తుంటుంది. ఆ మూమెంట్‌ను 'దాదా' కోసం రాజ్‌ కుమార్ రావ్‌ రీక్రియేట్ చేశారు. ఆ సెలబ్రేషన్‌ను ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు.

Also ReadHack For Heavy Earrings - బరువైన ఇయర్ రింగ్స్‌తో నొప్పి కలుగుతోందా? పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల చెప్పిన చిట్కా చూశారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

మే 14న థియేటర్లలోకి 'దాదా'
Dada Movie Release Date: 'దాదా' ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది (2027) మే 14న సినిమాను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. లాంగ్ హాలిడే వీకెండ్ సినిమాకు కలిసి వస్తుందని చెప్పవచ్చు. క్రికెట్ హిస్టరీలో గంగూలీ అంటే ఓ చరిత్ర. మరి, భారతీయ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో ఈ సినిమా ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.  

'దాదా- ది సౌర‌వ్ గంగూలీ'కి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్, డీబీఎల్ సమర్పణలో... లవ్ ఫిల్మ్స్ పతాకంపై లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మిస్తున్నారు.

Also ReadKangana Ranaut Queen 2 Controversy - కంగనా రనౌత్‌కు భారీ షాక్... కొత్త సినిమాపై 250 కోట్లకు కాపీరైట్ కేసు

Frequently Asked Questions

సౌరవ్ గంగూలీ బయోపిక్ పేరు ఏమిటి?

లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ పేరు 'దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ'. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

సౌరవ్ గంగూలీ పాత్రను ఎవరు పోషిస్తున్నారు?

బాలీవుడ్ నటుడు రాజ్‌ కుమార్ రావ్ సౌరవ్ గంగూలీ పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్‌లో ఆయన గంగూలీ ఐకానిక్ షర్ట్‌లెస్ మూమెంట్‌ను రీక్రియేట్ చేశారు.

'దాదా' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

'దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ' ప్రపంచవ్యాప్తంగా 2027 మే 14న విడుదల కానుంది. లాంగ్ హాలిడే వీకెండ్ సినిమాకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.

ఫస్ట్ లుక్‌లో రీక్రియేట్ చేసిన ఐకానిక్ మూమెంట్ ఏమిటి?

2002లో ఇంగ్లాండ్‌పై భారత్ గెలిచిన నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత లార్డ్స్ స్టేడియం బాల్కనీలో గంగూలీ జెర్సీ విప్పేసిన ఐకానిక్ మూమెంట్‌ను ఫస్ట్ లుక్‌లో రీక్రియేట్ చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
The Odyssey Review - 'ది ఒడిస్సీ' రివ్యూ: క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఎలా ఉందంటే?
'ది ఒడిస్సీ' రివ్యూ: క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఎలా ఉందంటే?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Siddharth Galla Wife: ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Embed widget