Rajinikanth Going to Build Free Hospital: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం తెలిసి అంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రజనీకాంత్‌ భారీగా భూములు కోనుగోలు చేసినట్టు ఇటీవల ఓ వార్తల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పనులతో ఆయన బిజీగా ఉన్నారంటూ సమాచారం.అయితే పేద ప్రజల కోసమే ఈ భూమి కొన్నారట. దాదాపు 12 ఎకరాల స్థలాన్ని కొన్నారు. ఆ స్థలంలో పేద ప్రజల కోసం ఉచితంగా ఆసుప్రతిని నిర్మించాలనే కీలక నిర్ణయం తీసుకున్నారంటూ ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.


ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇది తెలిసి అంతా రజనీ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. కాగా చెన్నై, తిరుప్పురూర్‌కు మధ్యలో 45 కి.మి దూరంలో ఈ భూమి ఉందని. అందరికి అందుబాటులో ఉండే విధంగా రజనీ ఈ ఆసుపత్రిని నిర్మించేందుకు భారీగా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని రకాల సదుపాయాలు ఉండేలా మల్టీస్పషాలిటీ హాస్పిటల్‌కు త్వరలోనే ఆయన శంకుస్థాపన చేయనున్నారంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరగుతుంది. త్వరలోనే భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతన్నాయట. మరి ఇదే నిజమైతే రజనీ మరోసారి అభిమానులు, ప్రజల దేవుడు ఖాయం. ఇప్పటికే రజనీ పేద ప్రజల కోసం పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.


Also Read: 20 ఏళ్ల తర్వాత కలిసిన ‘మన్మథుడు’ జంట - జ్ఞాపకాలకి కాలంతో పని లేదంటున్న అన్షు


ఎన్ని వందల కోట్లు ఆస్తులు, సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ ఉన్న ఒక సామాన్య వ్యక్తిగా జీవించడానికే ఆయన ఇష్టపడతారు. అలాంటి ఆయన రాజకీయాల్లోకి వస్తే పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెన్నై ప్రజల కోరిక. దాంతో ఆయన పొలిటికల్‌ ఎంట్రీపై ఎప్పుడూ వాడివేడిగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తారా? అని అభిమానులతో పాటు రాజకీవర్గాలు సైతం ఎదురుచూస్తున్నాయి. అంతేకాదు రజనీకి కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల అది వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన రజనీ, అనారోగ్యం వల్ల తన రాజకీయ ఆరంగేట్రాన్ని పూర్తి విరమించుకున్నట్టు తెలుస్తోంది. దాంతో రాజకీయాల్లోకి రాకపోయినా పేద ప్రజలకు తన వంతుగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఆస్పత్రి నిర్మించి ఉచిత వైద్య సేవల అందించాలని ఆయన అనుకుంటున్నారట.


అందుకే చెన్నై, తిరుప్పురూర్‌ రోడ్డులో 12 ఎకరాల స్థలం కొని అక్కడ హాస్పిటల్‌ నిర్మించాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. మరి దీనిపై రజనీ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఆయన లాల్‌ సలాం చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. ప్రస్తుతం ఆయన  వెట్టయాన్‌ మూవీలో నటిస్తున్నారు. ఇందులో టాలీవుడ్‌ భళ్లాలదేవ రానా, అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్ ఫాజిల్‌ వంటి దిగ్గజాలు వెట్టియాన్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ మూవీ షూటింగ్‌ కూడా పూర్తి కానుంది. దీనిక తర్వాత ఆయన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలోనూ మరో సినిమాకు కమిట్‌ అయినట్టు సమాచారం.