Kamal Haasan Rajinikanth Movie : 46 ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై కమల్, రజనీ కాంత్ - ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Rajinikanth : రజనీ కాంత్, కమల్ హాసన్ మూవీ అప్డేట్ వచ్చేసింది. 46 ఏళ్ల తర్వాత ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా... స్టైలిష్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Rajinikanth Kamal Haasan Movie Promo Released : కోలీవుడ్ సూపర్ స్టార్స్ మూవీ బిగ్ అప్డేట్ వచ్చేసింది. తలైవా రజనీ కాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ మూవీ ప్రోమో వీడియో రిలీజ్ అయ్యింది.
హీరో ఎవరు?
డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఓ లగ్జరీ హోటల్‌లో బయట వెయిట్ చేస్తుండగా... అనిరుధ్ అక్కడికి వచ్చి ఓ పజిల్ వేస్తాడు. అలా రెండు రూమ్స్‌లోకి వెళ్లిన నెల్సన్... ఒకరి గురించి ఒకరికి చెప్తుంటే తలైవా రజనీ సెలక్ట్ చేసిన ఐటమ్స్‌ను కమల్, కమల్ సెలక్ట్ చేసిన ఐటమ్స్‌ను రజనీ అవాయిడ్ చేస్తుంటారు. అలా ఇద్దరు లెజెండ్స్ పోటా పోటీగా స్టైల్‌గా రెడీ అయ్యి ఎంట్రీ ఇస్తారు.
గ్యారేజ్‌లో తలైవా తనదైన వాక్ స్టైల్‌తో ఎంట్రీ ఇవ్వగా అంతే రేంజ్‌లో కమల్ హాసన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. గ్యారేజ్‌లో అందమైన భామల మధ్య వీరిద్దరూ సందడి చేస్తూ వెళ్లి కారు ఎక్కి కూర్చోగా... ఆ వెనుకే డైరెక్టర్ నెల్సన్, అనిరుధ్ కూర్చుంటారు. 'సర్స్... ఒక బీతోవెన్, ఒక బప్పీ లహరిని మిక్స్ చేసినప్పుడు వచ్చే థీమ్ మ్యూజిక్ రెడీగా ఉంది వింటారా' అంటూ అనిరుధ్ ప్రశ్నిస్తే... 'అదంతా తర్వాత వింటాను. ఎవరు హీరో' అంటూ కమల్ ప్రశ్నించగా... 'అడుగుతున్నారు కదా చెప్పండి జీ' అంటూ తలైవా అనడంతో తెల్లముఖాలు వేయడం డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ వంతైంది.
Also Read : 'సరస్వతి' అవసరమైతే కాళీగా మారుతుంది - ట్రైలర్‌తో హైప్ పెంచేసిన వరలక్ష్మి శరత్ కుమార్
ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఫస్ట్ వీడియోతోనే బిగ్ హైప్ క్రియేట్ చేయగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. 46 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడంతో జానర్, ఇతర నటీనటులు ఎవరు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ మూవీ గురించి ఇతర అప్డేట్స్ రానున్నాయి.
Born Cool. Built Retro. Eternal Swag. 😎 #KHxRK Telugu Promo 📷https://t.co/J81AXIQBwo@ikamalhaasan @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @DirRajivMenon @Nirmalcuts @KiranDrk #PallaviSingh @amritharam2 @valentino_suren @alagiakoothan @MShenbagamoort3 @arjundurai… pic.twitter.com/j6WyrpnlUN
— Red Giant Movies (@RedGiantMovies_) February 21, 2026
























