Rajendra Prasad Apologise To His Comments On MGR : సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రీసెంట్‌గా కత్తి కాంతారావు జాతీయ అవార్డుల ఈవెంట్‌లో తమిళ నటుడు ఎంజీఆర్‌ను ప్రస్తావిస్తూ తాను చేసిన కామెంట్స్ పొరపాటేనని అన్నారు. అవి అనుకోకుండా దొర్లిన కామెంట్స్ అని ఉద్దేశ పూర్వకంగా చేసినవి కాదని విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Continues below advertisement

అంత దైర్యం నాకుందా?

తమిళ నటుడు ఎంజీఆర్‌పై కామెంట్స్ చేసేంత ధైర్యం తనకు లేదని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 'తమిళ సినీ ప్రేక్షకుల మాదిరిగానే నేను కూడా ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో నోరు జారాను. అయితే, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావు. కొందరు ఈ అంశాన్ని పెద్దది చేశారు. ఆయనపై కామెంట్స్ చేసేంత ధైర్యం నాకుందా?

Continues below advertisement

నేను చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఉండగా ఆయన సీఎంగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి  గురించి నేను మాట్లాడగలనా? నా కామెంట్స్ ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి. భవిష్యత్‌లో ఇలాంటి కామెంట్స్ ఎప్పుడూ చేయను.' అంటూ చెప్పారు.

Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ - వేదిక ఎక్కడో తెలుసా?... పవన్ స్పీచ్‌పైనే అందరి ఫోకస్

రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?

భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టీవీ కల్చరల్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్‌కు కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ పురస్కారం ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... కాంతారావును ప్రశంసిస్తూ నోరు జారారు. 'కాంతారావు గారిని చూసి ఉ**** పోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు చెబితే ఆయన జానపదాలు చూసి... వాడెవడ్రా బాబోయ్, మొత్తం ఇండియన్ సినిమానే లేపుకెళ్లిపోతున్నాడంట అంటూ ఎంజీఆర్ భయపడ్డారు' అంటూ కామెంట్స్ చేశారు.

ఈ కామెంట్స్‌పై తమిళ నటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు, సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్‌ను తప్పుబడుతూ... ఆయన కామెంట్స్ చూసి షాకయ్యానని... ఆయన తీరుతో విసుగు చెందానని అన్నారు. కాంతారావు గురించి చేసిన రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రసంగం బాగుందని... కానీ మరో దిగ్గజ నటుడు ఎంజీఆర్‌ను తిట్టడం తగదని చెప్పారు. ఈ విషయంలో సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, నటుడు నాజర్ సైతం రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ దిగ్భ్రాంతి కలిగించాయని అన్నారు.

గతంలోనూ రాజేంద్ర ప్రసాద్ కొన్ని బహిరంగ ఈవెంట్స్‌లో నోరు జారారు. రాబిన్ హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో డేవిడ్ వార్నర్‌పై చేసిన కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారి తీయగా సారీ చెప్పారు. రీసెంట్‌గా కమెడియన్ అలీని బూతు పదాలతో సంబోదించడంపైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగింది. ఆ తర్వాత భవిష్యత్తులో అందరినీ గౌరవించే మాట్లాడతానని చెప్పారు రాజేంద్ర ప్రసాద్.