Rajamouli About Motion Picture Lab in Annapurna Studios : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విజువల్ వండర్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబో వారణాసి. టైటిల్ గ్లింప్స్‌తోనే హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అందించారు జక్కన్న. ఈ మూవీలో మైథాలజీ పార్ట్ పాతిక నిమిషాలు ఉంటుందని ఇదివరకే చెప్పారు రాజమౌళి. 'రామాయణం'లో ఓ ముఖ్య ఘట్టాన్ని తెరకెక్కిస్తుండగా హైప్ క్రియేట్ అవుతోంది.
మోషన్ పిక్చర్ టెక్నాలజీ సాయంతో...
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 'వారణాసి'ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... రీసెంట్‌గా జార్జియాలో షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో 'రామాయణం' పార్ట్ తెరకెక్కించడం అత్యంత సవాల్‌తో కూడుకున్నదని తాజా ఇంటర్వ్యూల్లో చెప్పారు రాజమౌళి. ఆ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుండగా... హై లెవల్ 'మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ' సాయంతో ఈ షెడ్యూల్ షూట్ కంప్లీట్ చేశారు జక్కన్న. ఇతర కీలక సీన్స్ కూడా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పూర్తి చేస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్
ఈ అత్యాధునిక టెక్నాలజీని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే అందుబాటులోకి తెచ్చారు. 'వారణాసి' మూవీతోనే ఈ టెక్నాలజీ స్టూడియోను ప్రారంభించగా... కీలక సీన్స్ ఎలా షూట్ చేశారో వివరించారు రాజమౌళి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. భారీ సెట్‌లో కొందరు మోషన్ కాప్చర్ సూట్ వేసుకుని గదలు పట్టుకుని కనిపిస్తున్నారు. దీంతో ఈ సీక్వెన్స్ రామాయణం యుద్ధ సన్నివేశాలే అని తెలుస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో వానర సైన్యంతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఎలా తీశారో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ చూడాల్సిందే.
Also Read : విరోష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - స్వీట్ మూమెంట్స్ విత్ స్వీట్స్... వీడియో వైరల్
రాజమౌళి ఏమన్నారంటే?
అన్నపూర్ణ స్టూడియోస్‌లో మోషన్ పిక్చర్ ల్యాబ్ ఏర్పాటు కావడంపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. 'భారతదేశంలో ఎల్లప్పుడూ ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ప్రధాన ప్రపంచ నిర్మాణాలకు దోహద పడుతున్నారు. కానీ మనకు ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో లేదు. అప్పట్లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉండుంటే బాహుబలి, ఈగ మూవీస్ ఇంకా బెటర్‌గా చేసుండే వాడినని అనుకుంటాను.
A&M, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ పరిచయంతో నా కల నెరవేరుతుంది. ఇకపై ఈ టెక్నాలజీ కోసం అవుట్ సోర్సింగ్ సంస్థలపై ఆధార పడాల్సిన పని లేదు. నేను వరల్డ్ వైడ్‌గా అనేకు మోషన్ క్యాప్చర్ ల్యాబ్స్ సందర్శించాను. కానీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో లేటెస్ట్ ల్యాబ్ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్‌గా ఉంది. వారణాసిలో కీలక సీన్స్ రూపొందించడంలో మేము ఈ సౌకర్యం యూజ్ చేస్తున్నాం.' అంటూ చెప్పారు.
సరికొత్త మైలురాయి
ఇండియన్ సినిమా జర్నీలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఓ అరుదైన మైలురాయి అని చెప్పారు కింగ్ నాగార్జున. ఈ టెక్నాలజీతో చిత్ర నిర్మాతలు హైదరాబాద్‌లోనే ఇతిహాస సాహసాల నుంచి, కష్టమైన సైన్స్ ఫిక్షన్ డ్రామాల వరకూ ప్రతీ దాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించవచ్చని చెప్పారు. ఇండియాలో వరల్డ్ వైడ్ చలన చిత్ర నిర్మాణ సదుపాయాలు నిర్మించాలనే ఈ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి తెచ్చినట్లు నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు.
