Rajamouli About RRR Sequel: ఆర్ఆర్ఆర్.. తెలుగోడి సత్తాను, టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ. ఎన్టీఆర్, చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సీక్వెల్‌పై రాజమౌళి తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎస్.. 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ ఉంటుంది
రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిల (Rajamouli) మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముగ్గురూ ఎక్కడ కలిసినా సందడే సందడి. ఇటీవల లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన 'ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్'లో ముగ్గురూ ఎంజాయ్ చేశారు. ఈ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా.. రాజమౌళిని ఇద్దరు స్టార్ హీరోలు ఆటపట్టించిన వీడియో బయటకు వచ్చింది.
చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి రాజమౌళి సరదాగా ఉన్న సమయంలో ఒకరు.. 'రాజమౌళి గారు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ 2 చేస్తారా?' అని అడగ్గా ఆయన 'ఎస్' అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఖుష్ అవుతున్నారు. అయితే, గతంలోనూ 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్‌పై పలుమార్లు హింట్ ఇచ్చారు రాజమౌళి. అటు.. కథా రచయిత, దర్శక ధీరుడి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సైతం ఓ స్టోరీ లైన్ ఉందని.. 'ఆర్ఆర్ఆర్ 2' (RRR 2) తెరకెక్కే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.
రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్ కాన్సర్ట్ చేసిన రెండో విదేశీ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. తొలి చిత్రంగా 'బాహుబలి 2' రికార్డు సృష్టించింది. ఈ 2 సినిమాలను తెరకెక్కించింది రాజమౌళియే. ఈ క్రమంలో ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదు. వారితో పాటే వీరు కూడా సందడి చేశారు.
Also Read: రిలీజ్‌కు ముందే రికార్డులు - నాని 'ది ప్యారడైజ్' మ్యూజికల్ రైట్స్ డీల్ ఎంతో తెలుసా?
ఎన్టీఆర్‌కు చరణ్ ముద్దు
ఇక ఇదే ఈవెంట్‌లో ఎన్టీఆర్‌కు చరణ్ ముద్దు పెట్టి మరీ హగ్ ఇచ్చారు. వేదికపైనే బర్త్ డే విషెష్ చెబుతూ సందడి చేశారు. ఈ టైంలో ఫ్యాన్స్ సైతం కేకలు వేస్తూ సందడి చేశారు. ఫ్రెండ్ షిప్ అంటే ఇదే అని.. ఎన్టీఆర్, చరణ్ మధ్య బాండింగ్ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే టైంలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం.. 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేయడం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. చిరంజీవి, బాలకృష్ణ కలిసి 'నాటు నాటు'కు స్టెప్పులేస్తే అది చరిత్రలో ఓ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో 'SSMB29'లో బిజీగా ఉండగా.. రామ్ చరణ్ 'పెద్ది' మూవీతో బిజీగా ఉన్నారు. అటు, ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీతో బిజీగా ఉన్నారు.