Varanasi Update : విజువల్ వండర్ 'వారణాసి' షూటింగ్ అప్డేట్ - కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Mahesh Babu : మహేష్ బాబు 'వారణాసి' మూవీ షూటింగ్‌పై దర్శక ధీరుడు రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Rajamouli Reaction About Mahesh Babu Varanasi Movie Shooting : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వారణాసి'. యావత్ సినీ ప్రపంచం ఈ విజువల్ వండర్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... తాజాగా షూటింగ్‌పై రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు.
అప్పుడే షూటింగ్ కంప్లీట్
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'వారణాసి' షూటింగ్ జూన్ నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు రాజమౌళి. ఇటీవలే జార్జియాలో లొకేషన్స్ చూసిన టీం అక్కడ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత VFX, ఇతర పనులపై టీం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ్ ఇప్పటికే షూటింగ్ 50 శాతం పూర్తైందని చెప్పారు. 'వారణాసి'లో రామాయణం పార్ట్ అత్యంత సవాల్‌తో కూడుకున్నదని... ఎక్కువ VFX కూడా అవసరం అవుతాయన్నారు.
Also Read : వాలెంటైన్స్ డే... పెళ్లి రూమర్స్ - అప్పుడే పెళ్లి చేసుకుంటానన్న హీరోయిన్ మృణాల్
'వారణాసి' సైన్స్ ఫిక్షనా?
'వారణాసి' టైటిల్ గ్లింప్స్‌లో వారణాసి నగర పుట్టుక నుంచి రామాయణంలో ముఖ్య ఘట్టం అన్నీ కలిపి చూపించారు. దీంతో ఇది ఏ జానర్ అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వీడియో బేస్ చేసుకుని ఒక్కొక్కరూ ఒక్కో జానర్ అంటూ ఊహించుకున్నారు. విలన్ రణ కుంభ లుక్ చూసి ఇది సైన్స్ ఫిక్షన్ అంటూ ఫిక్స్ అయిపోయారు. దీనిపై కూడా రాజమౌళి తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'వారణాసి' సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉన్నా ఇది ఆ జానర్ కాదని... ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అంటూ స్పష్టత ఇచ్చారు.
ఒకటే పార్ట్
'వారణాసి' ఒకటే పార్ట్ ఉంటుందని రన్ టైం మాత్రం 3 గంటలకు పైగా ఉంటుందని రీసెంట్‌గా హలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు జక్కన్న. 'మొదట రెండు పార్టులుగా చేస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించాం. అయితే ఆ ఆలోచన పక్కన పెట్టేశాం. సినిమాలో మైథాలజీ పార్ట్ 25 నిమిషాలు ఉంటుంది. మహేష్ శ్రీరాముడిగా కనిపిస్తాడు. ఈ ప్రాజెక్టును ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తీయడం పెద్ద సవాల్. సినిమాలో మొత్తం సినిమా స్కోప్ 1:90:1 లోనే ఉంటుంది. కీలక సీన్స్ ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో 1:43:1లో కనిపిస్తాయి. రామాయణం ఎపిసోడ్ ఇప్పటికే పూర్తి చేశాం. దానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు ఇప్పుడు మా ముందున్న సవాల్.' అంటూ చెప్పారు.
సినిమాలో రుద్రగా మహేష్ బాబు, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణ కుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఏప్రిల్ 7, 2027న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
























