Raaka Team Clarifies About Rumours About Deepika Padukone Shooting Delay Rumours : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రకటన వెలువడిన వెంటనే ఆమె ప్రస్తుతం నటిస్తోన్న భారీ ప్రాజెక్టులపై పలు రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అల్లు అర్జున్ 'రాకా'లో దీపికా కీలక పాత్ర పోషిస్తుండగా... షూటింగ్ డిలే కాబోతోందంటూ ప్రచారం సాగింది. దీనిపై తాజాగా టీం క్లారిటీ ఇచ్చింది.
షెడ్యూల్ ప్రకారమే...
షూటింగ్ డిలే అవుతుందని... దీపికా స్థానంలో మరొకరిని తీసుకుంటారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనిపై మూవీ టీం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. మూవీలో దీపికా పదుకోన్ రోల్ చాలా కీలకమని... షూటింగ్ అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే కంటిన్యూ అవుతుందని స్పష్టం చేసింది. 'సినిమాలో దీపిక రోల్ రన్ టైం కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆమె రోల్ మూవీకే కీలకం. క్రేజీ యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఆమె నటిస్తున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేస్తారు.' అని తెలిపింది.
Also Read : ఫైనల్‌గా ‘పెద్ది’ కోసం ఐటమ్ పాప ఫిక్సయింది.. ఎవరో తెలిస్తే షాకే!
షూటింగ్ అప్డేట్...
ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ముంబైలోనే ఎక్కువ భాగం షెడ్యూల్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, దీపికాలపై కీలక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తోంది. తోడేలు చేయి గుండు ఆకారంలో ఉన్న బన్నీ లుక్ వేరే లెవల్. కేవలం లుక్ కోసమే బన్నీ 3 నుంచి 4 గంటల వరకూ స్పెండ్ చేస్తున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్.
స్టోరీ అదేనా?
ఈ మూవీలో బన్నీ రెండు డిఫరెంట్ రోల్స్‌లో నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రధాన పాత్రతో పాటు నెగిటివ్ రోల్ కూడా ఆయన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో పగలు మనిషిగా రాత్రి తోడేలుగా మారుతారంటూ సోషల్ మీడియా బజ్. కేవలం ఒక్క లుక్, టైటిల్‌తోనే నెట్టింట కొత్త స్టోరీస్ వైరల్ అవుతున్నాయి. చీకటి నుంచి వెలుగులు నింపే వారియర్‌గా బన్నీ కనిపించబోతున్నారని తెలుస్తోంది.
ఈ మూవీ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి VFXపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అట్లీ సిల్వర్ స్క్రీన్‌పై ఓ సరికొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం.
హీరోయిన్స్ ఎంతమందే?
ఈ మూవీలో హీరోయిన్స్ ఎంత మంది అనే దానిపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. కేవలం దీపికాను మాత్రమే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మరో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం సాగుతోంది. నేషనల్ క్రష్ రష్మిక నెగిటివ్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే, మృణాల్, జాన్వీ కపూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎవరిది అతిథి పాత్ర అనేది ఇంకా క్లారిటీ లేదు. వీటిపై స్పష్టత వచ్చేందుకు మరికొంత టైం పట్టే ఛాన్స్ ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
