'పుష్ప' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెన్నంటి ఉండే కేశవా క్యారెక్టర్ గుర్తు ఉందా? ఆ పాత్రలో నటించినది జగదీష్ ప్రతాప్ బండారి. ఒక్క సినిమాతో చాలా పాపులర్ అయ్యారు. పాపులారిటీతో పాటు ఓ వివాదంలోనూ చిక్కుకున్నారు. అది పక్కన పెట్టి ఇప్పుడు సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఆయన కార్తీక్ రాజు 'విలయ తాండవం'లో కీలక పాత్ర చేసే అవకాశం వచ్చింది.

Continues below advertisement

సహనం అంతమైతే రుద్రకాళి అవతరిస్తాడుWhen Patience Dies Rudra Kaali Rises - ఇదీ 'విలయ తాండవం' పోస్టర్ మీద ఉన్న క్యాప్షన్. అంటే... సహనం అంతమైన సమయంలో రుద్ర కాళి అవతరిస్తాడు అని మీనింగ్. రుద్రకాళి అవతారంలో యంగ్ హీరో కార్తీక్ రాజు కనిపిస్తారు. 

డిఫరెంట్ స్టోరీలతో కాన్సెప్ట్ ఓరియెంటెడ్, కంటెంట్ బేస్డ్ సినిమాలకు కార్తీక్ రాజు ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటువంటి చిత్రమే 'విలయ తాండవం' అని చిత్ర బృందం చెబుతోంది. కార్తీక్ రాజు జంటగా పార్వతి అరుణ్ నటిస్తున్న ఈ సినిమాలో 'పుష్ప' ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి కీలక పాత్రధారి. జీఎంఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాస రావు ముఖ్య అతిథులుగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

Continues below advertisement

Also Readభారీ ఓపెనింగ్ మీద కన్నేసిన 'కాంతార'... ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్‌ రిపోర్ట్... కలెక్షన్లలో కుమ్ముడే

'విలయ తాండవం' టైటిల్ లాంచ్ తర్వాత ఆకాష్ పూరి మాట్లాడుతూ... ''టైటిల్ పోస్టర్‌ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకు సినిమాతో పేరు, విజయం రావాలని కోరుకుంటున్నా'' అని అన్నారు. భీమనేని శ్రీనివాస రావు మాట్లాడుతూ... ''నేను దర్శకత్వం వహించిన 'కౌసల్యా కృష్ణమూర్తి'లో నటించారు. కార్తీక్ రాజు ఎప్పుడు డిఫరెంట్ కథలు ఎంపిక చేసుకుంటాడు. 'విలయ తాండవం'తో కార్తీక్ రాజు మరో హిట్ అందుకోవాలి'' అని అన్నారు.

Also Read'కాంతార చాప్టర్ 1' రివ్యూ: రిషబ్ శెట్టి మళ్ళీ సక్సెస్ కొడతారా? 'కాంతార' ప్రీక్వెల్ హిట్టా? ఫట్టా?

హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ... ''ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దర్శకుడు వాసు సరికొత్త పాయింట్, కథతో సినిమా తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతారు. ఇందులో నేను, పార్వతి, జగదీష్ ముఖ్యమైన పాత్రలు పోషించాం. ఈ సినిమాతో నిర్మాతలు ధర్మారావు, గుంపు భాస్కర రావు నా కుటుంబ సభ్యుల్లా మారిపోయారు'' అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు, దర్శకుడు వీఎస్ వాసు, సంగీత దర్శకుడు గ్యానీ, కొరియోగ్రాఫర్లు 'ఆట' సందీప్, కపిల్ మాస్టర్ పాల్గొన్నారు.